Who is the hero who gave up the role of Prabhas in Kalki movie

Prabhas: ప్రస్తుతం దేశ సినీ చరిత్రలోనే హిస్టరీ క్రియేట్ చేస్తున్న కల్కి 2898 AD మూవీ రికార్డ్స్ ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. ఈ సినిమాకి దేశ విదేశాల్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ మూవీకి ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కాదట. మరో హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడం వల్ల అది ప్రభాస్ దాకా వచ్చిందట.మరి ఇంతకీ ఇంటిదాకా వచ్చిన అదృష్టాన్ని కాళ్ళతో తన్నిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. కల్కి 2898 ఎడి మూవీలోని ప్రభాస్ భైరవ పాత్ర ముందుగా మెగాస్టార్ చిరంజీవి కి వెళ్ళిందట.

Who is the hero who gave up the role of Prabhas in Kalki movie

అయితే వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి సీక్వెల్ చేద్దామని అప్పట్లో నాగ్ అశ్విన్ అనుకున్నారట.కానీ ఇది కుదరదు.ఎందుకంటే శ్రీదేవి బతికి లేరు. అయితే అక్కడికి వెళ్లిన సమయంలో చిరంజీవికి కల్కి స్టోరీ చెప్పారట. ఇది విన్న చిరు చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పారట.అయితే చిరంజీవి రివ్యూ విన్నాక నాగ్ అశ్విన్ ఇది మీకోసమే రాసుకున్నానండి అని చెప్పడంతో చిరంజీవి షాక్ అయ్యి నో నో ఇది నాకు సెట్ అవ్వదు.(Prabhas)

Also Read: Prabhas: ఆరు భారీ సినిమాలను లైన్లో పెట్టిన డార్లింగ్.. మనోడు మంచి తెలివైనోడే గా..!

ఈ పాత్రకి నేను న్యాయం చేయలేను. మీకు ఈ సినిమాలోని భైరవ పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యేది ప్రభాస్ మాత్రమే.ఈ సినిమాలోని భైరవ పాత్రకి 100% న్యాయం ప్రభాస్ మాత్రమే చేయగలడు. ఆయన చేస్తేనే సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ నాగ్ అశ్విన్ కి చిరంజీవి చెప్పారట. ఇక చిరంజీవి మాట విని ప్రభాస్ దగ్గరికి వెళ్లి ఈ స్టోరీ చెప్పగా ఆయనకి ఫుల్లుగా నచ్చేసింది. ఆ తర్వాత షూటింగ్,విడుదల,బ్లాక్ బస్టర్ ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి.

Who is the hero who gave up the role of Prabhas in Kalki movie

అయితే ప్రస్తుతం ఈ రూమర్ నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ ఇంటిదాకా వచ్చిఅదృష్టాన్ని చిరంజీవి కాళ్లతో తన్నేసారు. కనీసం తన కొడుకు రామ్ చరణ్ తో నైనా చేయమని చెప్పాలి కదా. అలా కాదని ప్రభాస్ తో చేయమన్నారా అని కామెంట్లు పెడుతున్నారు.కానీ మరి కొంతమందేమో చిరంజీవి తీసుకున్న నిర్ణయం కరెక్ట్.ఈ పాత్రకి ప్రభాస్ ఐతేనే 100% న్యాయం చేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Prabhas)