Kalki Arjunu as special guest for Telugu Indian Idol Show

Vijay Devarakonda: ఇండియన్ ఐడల్.. హిందీలోనే కాదు తెలుగులో సైతం మంచి రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో మూడో సీజన్ నడుస్తుంది. అయితే ఈ షో కి ఓ స్పెషల్ గెస్ట్ రాబోతున్నట్లు ఈ షో నిర్వాహకులు వీడియోతో ప్రకటించారు. వాళ్లు అతని పేరు చెప్పకపోయినా ఇచ్చిన హిట్స్ తో అతడు కల్కి మూవీలో అర్జునుడే అని తేలిపోయింది.

ఈమధ్య కల్కి సినిమాలో అర్జునుడి పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ షో ఎపిసోడ్కి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడు. ఇదే విషయాన్ని చెబుతూ ఆహా ఓటిటి తమ సోషల్ మీడియా అకౌంట్ లో వీడియోలు రిలీజ్ చేసింది. ఈ ఇండియన్ ఐడల్ జడ్జిలతో పాటు కంటెస్టెంట్లు కూడా ఆ గెస్ట్ గురించి కొన్ని హింట్స్ ఇచ్చారు. ఇక ఈ షో కి జడ్జ్ గా ఉన్న సింగర్ కార్తీక్ అయితే కళ్యాణి వచ్చా వచ్చా అని పాడుతూ వచ్చేది విజయ్ దేవరకొండ అనే తేచి చెప్పాడు.

Kalki Arjunu as special guest for Telugu Indian Idol Show

12 మంది టాప్ సింగర్స్ తో ప్రస్తుతం ఈ షో సీజన్ 3 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్త సీజన్లో ఆడియన్స్ తరువాత మిగిలిన కంటెస్టెంట్లు ఒకరిని మించి మరొకరు పర్ఫార్మ్ చేస్తూ ఈ షోని చాలా ఆసక్తికరంగా మారుస్తున్నారు. ఈ తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్లో జడ్జిలుగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు సింగర్ కార్తీక్, శ్రీరామ్ చంద్ర మరియు గీతామాధురి ఉన్నారు.