KCR: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గులాబీ పార్టీలో ఉన్న చాలామంది నేతలు అందరూ బయటకు వెళ్తున్నారు. ఏ ఒక్క నేత కూడా… గులాబీ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి కేసులు పెట్టడం, కెసిఆర్ ను అరెస్టు చేస్తానని చెప్పడం… అలాగే నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకపోవడం లాంటి చర్యలు చేపట్టడంతో… ప్రస్తుతానికి గులాబీ పార్టీ నుంచి బయటికి రావాలని చాలామంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. KCR

Big shock for KCR Uncle, brother-in-law jump

ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో దూకేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే… మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలోంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. తాజా సమాచారం ప్రకారం… గులాబీ పార్టీ కీలక నేత మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. KCR

Also Read: Ys Sharmila: మళ్లీ ఒక్కటవుతున్న జగన్మోహన్ రెడ్డి, వైయస్ షర్మిల ?

మాజీ మంత్రి మల్లారెడ్డి తో పాటు…. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారట. అంతేకాకుండా… గద్వాల ఎమ్మెల్యే బండ్ల మోహన్ కృష్ణ కూడా… కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చలు కూడా చేశారట. KCR

మొన్నటి వరకు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాకను… మైనంపల్లి హనుమంతరావు… అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే వేం నరేందర్ రెడ్డి ఈ విషయంలో… జోక్యం చేసుకొని… మల్లారెడ్డి రాకను క్లియర్ చేశారట. దీంతో… మల్లారెడ్డి తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో దూకపోతున్నారట. ఇక దీంతో కేసీఆర్ కూడా.. అలర్ట్ ఐ వీరిపై యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. KCR