Case registered against Raj Tarun

Raj Tarun: యంగ్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఇండస్ట్రీ కి రాకముందు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో చేసి సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచారు. అలా మెల్లి మెలిగా సినిమా వాళ్లతో పరిచయాలు పెంచుకొని చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ తో ఉయ్యాల జంపాల అనే మూవీతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ కి టాలీవుడ్ లో తిరుగుండదని అందరూ అనుకున్నారు.అలాగే ఆ తర్వాత వచ్చిన కుమారి 21ఎఫ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో రాజ్ తరుణ్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది.

Case registered against Raj Tarun

ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించినప్పటికీ రాజ్ తరుణ్ కి అంతగా హిట్స్ పడకపోవడంతో మెల్లిమెల్లిగా ఈ హీరో క్రేజ్ టాలీవుడ్ లో పడిపోతూ వచ్చింది. ఇక ఈయన నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈయన సినిమాలు చూడడమే మానేశారు అభిమానులు. అయితే గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వినిపించిన సమయంలో ఓ హీరో లవర్ ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడింది అనే టాక్ వినిపించింది.అయితే ఆ హీరో పేరు కూడా బయటపడింది.ఆయన ఎవరో కాదు రాజ్ తరుణ్ అయితే తాజాగా ఆ హీరో లవర్.. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న యువతి.. హీరో రాజ్ పై కేసు పెట్టింది.(Raj Tarun)

Also Read: Vijay thalapathi: భార్యకు విడాకులు ఇవ్వబోతున్న విజయ్.. త్రిష తో పెళ్లి..!

దానికి కారణం రాజ్ తరుణ్ నాతో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తూ గత కొద్దిరోజుల నుండి నన్ను అవాయిడ్ చేస్తూ మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ సంచలన కామెంట్లు చేసింది. అంతేకాదు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సమయంలో కూడా నాకు రాజ్ ఎలాంటి సహాయం అందించలేదని,అలాగే రాజ్ నన్ను సీక్రెట్ గా ఓ గుళ్లో పెళ్లికూడా చేసుకున్నాడు. ఈ విషయం బయట పెట్టనివ్వలేదు. చాలా సంవత్సరాలుగా మేమిద్దరం కలిసి ఉంటున్నాం. కానీ గత కొద్ది రోజుల నుండి నన్ను పక్కన పెడుతూ నాతో మాట్లాడడం లేదు.అయితే ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో రాజ్ ఎఫైర్ మెయింటైన్ చేస్తూ నన్ను దూరం పెడుతున్నాడు.

Case registered against Raj Tarun

అంతేకాకుండా ఆ సినీ హీరోయిన్ కూడా రాజ్ ని వదిలేయకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తోంది.అలాగే డ్రగ్స్ కేసు కు నాకు ఎలాంటి సంబంధం లేదు.కావాలనే నన్ను ఈ కేసులో ఎవరో ఇరికించారు.నాకు రాజ్ తరుణ్ నుండి న్యాయం కావాలి అంటూ నార్సింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది ఆయన లవర్ లావణ్య.. దీంతో ఈ మ్యాటర్ కాస్త టాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్కసారిగా రాజ్ తరుణ్ నిజస్వరూపం బయటపడేసరికి అందరూ షాక్ అవుతున్నారు. ఇక రాజ్ తరుణ్ తో మాల్వి మల్హోత్రా తిరగబడరా సామి మూవీలో నటిస్తోంది.(Raj Tarun)