Is Rakul Preet Singh life going as Swamiji said

Rakul Preet Singh: పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్..ఈ ఏడాది ఫిబ్రవరి 21న గోవాలో అంగరంగ వైభవంగా బాలీవుడ్ నటుడు నిర్మాత అయినటువంటి జాకీభగ్నానీతో ఏడడుగులు వేసింది. ఇక వీరికి పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.అయితే ప్రస్తుతం పెళ్లి వార్తలు సద్దుమణిగినప్పటికీ బాలీవుడ్ లో రకుల్ భర్త జాకీభగ్నాని గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే రకుల్ భర్త జాకి భగ్నాని తన సంస్థలోని కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టు బీటౌన్ లో వార్త గత నెల కొన్ని రోజుల నుండి చక్కర్లు కొడుతుంది.

Is Rakul Preet Singh life going as Swamiji said

అయితే జాకి బగ్నాని నటుడు మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కొన్ని సినిమాలను నిర్మించారు.అలా నిర్మాతగా కూడా మారారు. ఈయన తన నిర్మాణ సంస్థ అయిన పూజ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఎన్నో సినిమాలకు నిర్మాతగా చేశారు.అలా ఈయన నిర్మాణ సంస్థలో పని చేసే కొంత మంది వర్కర్స్ కి గత సంవత్సర కాలం నుండి మాకు జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ సంచలన ఆరోపణ చేశారు. అంతేకాదు మాకు చాలా ఇబ్బంది ఉండడం వల్లే ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెడుతున్నామని,ఇన్ని రోజులు జీతం ఇవ్వకపోతే ఎవరు ఆగారని, అలాగే ఈ సంస్థలో ఈ మధ్యనే ఒక పెద్ద సినిమా చేశారు.(Rakul Preet Singh)

Also Read: Raj Tarun: లవర్ తో సీక్రెట్ పెళ్లి.. మోజు తీరగానే మరో హీరోయిన్ తో ఎఫై**.. హీరో పై కేసు నమోదు.!

అందులో ఉన్న నటినటులు అందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చారు. కానీ మాకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదు అని వాపోయారు. దాంతో ఈ మేటర్ కాస్త మీడియాలో వైరల్ అయింది.అయితే ఈ విషయం బయటపడడంతో కొంతమంది నెటిజన్స్ రకుల్ జీవితంలో స్వామీజీ చెప్పినట్లు జరుగుతోంది గా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంటే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అప్పట్లో చెప్పారు.

Is Rakul Preet Singh life going as Swamiji said

అంతే కాదు రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే కాదు అనుష్క, నయనతార, సమంత వంటి హీరోయిన్లకు పెళ్లి అచ్చరాదని చెప్పారు.అయితే ఈయన చెప్పినట్టే సమంతకి పెళ్లి జీవితం కలిసి రాలేదు. అలాగే అనుష్క ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు. ఇక పెళ్లి చేసుకున్న నయనతార జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కి పెళ్లయ్యాక కొద్ది రోజులకే తన భర్త నిర్మాణ సంస్థ గురించి మీడియాలో వార్తలు రావడంతో రకుల్ జీవితంలో కూడా వేణుస్వామి చెప్పినట్టే జరగబోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Rakul Preet Singh)