Manchu Lakshmi Emotional Post

Manchu Lakshmi: మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే మంచు లక్ష్మికి ఒక కూతురు కూడా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురుగా మంచు లక్ష్మి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేసి ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా కొనసాగుతోంది. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే..తాజాగా, ఓ పోస్టులతో మంచు లక్ష్మి వార్తల్లో నిలిచింది. “నిరాశలో సహాయం కోసం వెయిట్ చేస్తున్నాను! నా వీసా ఒక నెల క్రితం అప్లై చేశాను. కానీ ఇప్పటికీ నాకు అది రాలేదు. నా కూతురై పాఠశాల సెలవులు ముగుస్తున్నాయి. జూలై 12 న ఫ్లైట్ ఉంది.

Manchu Lakshmi Emotional Post

ఎంబసి వెబ్ సైట్ డౌన్ కావడంతో, వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా సహాయం చెయ్యగలరా? “అని పోస్ట్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనితో ఇది చూసిన నెటిజన్లు తమకు తెలిసినవాళ్లు ఫోన్ నెంబర్ ఇచ్చి సహాయం చేస్తున్నారు. అలాగే కొందరు మాత్రం మీరు ఒక సెలబ్రిటీ అని మర్చిపోయారా? జనాలను హెల్ప్ చెయ్యమంటున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.