Motorola Razr 50 Ultra: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లవాడకం విపరీతంగా పెరిగిపోయింది. నిన్నటి మొన్నటి వరకు 4G ఫోన్లు వాడితే ప్రస్తుతం 5G ఫోన్ల ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి చేతిలో 5జి ఫోన్ల వాడకం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా కంపెనీదారులు 5జి ఫోన్లను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకురావడంతో ప్రతి ఒక్కరు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ తెలుగు స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన ప్రీమియం ఫోన్ మోటరోలా రేజర్ 50 అల్ట్రా ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే….50 అల్ట్రా ఫోన్ 12gb రామ్ విత్ 512gb స్టోరేజ్ వేరియంట్ తో రూ. 99, 999కే అందుబాటులో కలదు. Motorola Razr 50 Ultra

Motorola Razr 50 Ultra With Snapdragon 8s Gen 3 SoC, 4-Inch Cover Display Launched in India

మోటరోలా రేజర్ 50 అల్ట్రా ఫోన్ మనకు మూడు కలర్లలో అందుబాటులో లభిస్తుంది. మిడ్ నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో కలదు. ఈ ఫోన్ ఎర్లీ బడ్ సేల్స్ లో భాగంగా రూ. 5000 డిస్కౌంట్ తో రూ. 94,999 రూపాయలకు లభిస్తోంది. ఇక సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై మోటరోలా రేజర్ 50 అల్ట్రా కొనుగోలు చేస్తే ఆదనంగా రూ . 5,000 ఇన్ స్టంట్ క్యాష్ డిస్కౌంట్, రూ. 5000తో లభిస్తోంది. ఇక ఈ ఫోన్ ఈఎంఐ సదుపాయంలో కూడా కొనుగోలు చేయవచ్చు. Motorola Razr 50 Ultra

Also Read: Xiaomi 14T Pro: మార్కెట్ లోకి క్రేజీ ఫోన్…ధర, ఫీచర్స్ ఇవే !

ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 వెర్షన్ పై పనిచేస్తుంది. ఇందులో 165 hz రిఫ్రెష్ రేటు 300HZ టచ్ షాంప్లింగ్ రేట్, 413పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో పాటు అందుబాటులో కలదు. ఇక ఈ ఫోన్లో 6.9 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను అమర్చారు. మోటరోలా రేజర్ 50 అల్ట్రా ఫోన్ కవర్ డిస్ప్లే 4 అంగుళాల (1080×2 640పిక్సెల్స్) ఎల్టిపిఓ పోలేడ్ ప్యానల్ డిస్ప్లే విత్ హెచ్డిఆర్ 10+ సపోర్ట్, కార్వింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. Motorola Razr 50 Ultra

ఇక ఈ ఫోన్లో 50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ 50 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ తో పాటు ఇన్నర్ డిస్ప్లే తో 32 మెగా పిక్సెల్ కెమెరా కలదు. 4000 ఎమ్ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ అందుబాటులో కలదు. ఇక ఈ ఫోన్ చార్జింగ్ కేవలం అరగంటలోనే ఫుల్ అవుతుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టి 24 గంటలు సులభంగా వాడుకోవచ్చు. ఇక మోటరోలా రేజర్ 50 అల్ట్రా ఫోన్ కొనుగోలు చేయాలని ఆసక్తితో ఉన్నవారు వెంటనే కొనుగోలు చేసినట్లయితే డిస్కౌంట్ లభిస్తుంది. Motorola Razr 50 Ultra