Naga Chaitanya comments

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 ఏళ్లు పూర్తవుతుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈయనకి బ్యాడ్ పేరు ఎప్పుడు రాలేదు. ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకున్నారు. అలాగే తాజాగా తండెల్ మూవీతో రానున్న సంగతి తెలిసింది. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు..ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒకటి కూడా సొంతం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ సందడి చేస్తున్నాడు.

ఒక గతేడాది ‘కస్టడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలు మధ్య ఈ సినిమా కూడా ఈ హీరోకి అంతగా కలిసి రాలేదు. ఇక ప్రజెంట్ చందుమొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అనే సినిమా చేస్తున్న చైతన్య..త్వరలోనే కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని హీరో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. చైన్నైలో పుట్టి పెరిగిన ఆయన డిగ్రి చదివే సమయానికి హైదరాబాద్ కి వచ్చేసారు.

Naga Chaitanya comments

ఇక డిగ్రీ చదువుతున్న సమయంలో సమ్మర్ వెకేషన్ కి ముంబై వెళ్లి ఎంజాయ్ చేసేవాడట. ఇక చిన్నప్పుడు తన తల్లితో ట్రైన్ లో ముంబై కి వెళ్లి.. మరోసారి తల్లితోపాటు హైదరాబాద్ కు ట్రైన్ జర్నీ చేశారట. ఈ రెండుసార్లు ప్రయాణం నాకు ఎప్పటికే స్పెషల్ గానే ఉంటమని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో తిరిగిన, ఎన్ని మిస్ అయినా, చివరికి నా రిటైర్ మెంట్ టైం కి గోవాలోనే సెట్టల్ అవుతా. 45 ఏళ్లు వచ్చాక పూర్తిగా గోవా కి పిప్ట్ అయిపోయి.. ఏడాదోక సినిమా తీసుకుంటూ అక్కడే పూర్తిగా ఉండిపోవాలి అనుకుంటున్నాను అని తెలిపాడు నాగచైతన్య.