Nayanthara is very froud.. Even Venkatesh is not counted

Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కాస్త పొగరు అని ఇప్పటికే చాలామంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది ప్రముఖులు తెలియజేశారు. అయితే ఆమె చిన్న డైరెక్టర్లతో చిన్న హీరోలతో సినిమాలు చేసేటప్పుడు చాలా పొగరు చూపిస్తుందని టైం కి షూటింగ్ కి రాకుండా సినిమా యూనిట్ వాళ్ళందర్నీ ఇబ్బంది పెడుతుందని ఇలా ఎంతో మంది ఆరోపణలు చేశారు.

Nayanthara is very froud.. Even Venkatesh is not counted

అయితే తాజాగా నయనతారపై స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు నయనతారపై అలాంటి కామెంట్స్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. నయనతారకు పొగరు అనేలా మాట్లాడింది ఎవరో కాదు టాలీవుడ్ డైరెక్టర్ మారుతి.. ఇక ఈ డైరెక్టర్ నయనతార,వెంకటేష్ కాంబోలో బాబు బంగారం సినిమాకి దర్శకత్వం వహించారు. (Nayanthara)

Also Read: Naga Chaitanya: ఆమెతో ఆ ప్రయాణం ఎప్పటికీ స్పెషల్ గానే ఉంటుంది.. నాగచైతన్య కామెంట్స్..!

అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో నయనతార చాలా అవమానించిందట.షూటింగ్ కి టైం కి రాకుండా నువ్వెంత అనేలా ప్రవర్తించేదట. అంతేకాదు మారుతి చిన్న డైరెక్టర్ కావడంతో అసలు ఆయన మాటలను కూడా లెక్క చేయలేదు.చివరికి వెంకటేష్ వంటి పెద్ద హీరోని కూడా చాలాసార్లు వెయిట్ చేయించి అవమానించిందట.

Nayanthara is very froud.. Even Venkatesh is not counted

దాంతో ఓపిక నశించిన డైరెక్టర్ మారుతి షూటింగ్ సెట్లో ఓ రోజు నయనతార తో గొడవకు దిగాడట. అయినా కూడా నయనతార ప్రవర్తన మార్చుకోలేదట. అంతేకాదు బాబు బంగారం సినిమా క్లైమాక్స్ లో ఓ పాట కూడా ఉంటుందట. కానీ ఈ పాటకి నయనతార సహకరించకపోవడంతో ఆ పాట లేకుండానే క్లైమాక్స్ పూర్తి చేశామని డైరెక్టర్ మారుతి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూ ఈ విషయాన్ని బయటపెట్టారు.(Nayanthara)