Paytm: ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి చిన్నపాటి అనారోగ్యానికి గురైన కూడా వేలు లక్షలు కట్టాల్సి ఉంటుంది. దీంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. మెడికల్ ఇన్సూరెన్స్ లో ఆర్థిక భరోసా కల్పిస్తుందని చెప్తున్నారు. కోవిడ్ మహమ్మారి మన తర్వాత ఆరోగ్య భీమా తీసుకోవడానికి చాలామంది ముందుకొస్తున్నట్లు పలువు నివేదికలు చెబుతున్నాయి. వైద్య ఖర్చుల్ని భరించడానికి ప్రతి ఒక్కరికి భీమా ఉండాలి.

Paytm health Saathi

అలాగే పలు సంస్థలు తమ భాగస్వామ్య సంస్థలు వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లాంచ్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా సింటెక్ సంస్థ పేటీఎం తన మర్చంట్ భాగస్వామ్యల కోసం కేవలం నెలకు 35 తో హెల్త్ ప్లాన్ చేసింది. నోయిడా కు చెందిన 197 కమ్యూనికేషన్స్ కు చెందిన సింటెక్ సంస్థ పేటీఎం కొత్తగా పేటీఎం హెల్త్ సాతి పేరుతో మర్చంట్ పార్ట్నర్స్ కోసం హెల్త్ ఇన్కమ్ టాక్స్ ప్రొటెక్స్ ప్లాన్ తీసుకొచ్చింది.

Also read: Maps: గూగుల్‌ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మొద్దు.. తప్పక ఇవి ఫాలో అవ్వండి..!

ఈ మేరకు జూలై మూడవ తేదీన ఎక్స్చేంజి ఫైలింగ్ లో వెల్లడించింది ఈ కొత్త ప్లాన్ పేటీఎం బిజినెస్ యాప్ లో అందుబాటులో ఉంటుంది. మర్చంట్ సంక్షేమం తమతో వ్యాపారాన్ని సుదీర్ఘకాలం కొనసాగించడానికి ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంగా భాగంగా పేటియం హెల్త్ సాతి లాంచ్ చేయడం జరిగింది. ఈ సేవల ద్వారా మర్చంట్ల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలుగుతున్నాం అని చెప్పింది. వారికి చాలా తక్కువ ప్రీమియంతో భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఎక్స్చేంజి ఫైలింగ్ లో కంపెనీ చెప్పింది (Paytm).