Reason why the Gangotri movie heroine Aditi Agarwal is still unmarried

Aditi Agarwal: అదితి అగర్వాల్ టాలీవుడ్ దివంగత నటి స్టార్ హీరోయిన్ అయినటువంటి ఆర్తి అగర్వాల్ సోదరిగా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ హీరోగా చేసిన మొదటి సినిమా రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది… ఈమె తన అక్కని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చింది.అయితే అదితి ఇండస్ట్రీలోకి ఇచ్చే సమయంలో ఆర్తి అగర్వాల్ స్టార్ హీరోయిన్. దాంతో ఈ హీరోయిన్ ని కూడా స్టార్ చేయాలని దర్శక నిర్మాతలు భావించారు.

Reason why the Gangotri movie heroine Aditi Agarwal is still unmarried

కానీ ఈమె చేసిన గంగోత్రి సినిమా తప్ప ఆ తర్వాత చేసిన కొడుకు, ఏం బాబు లడ్డు కావాలా, విద్యార్థి వంటి సినిమాలు అంతగా హిట్ అవ్వలేదు.దాంతో ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరమైంది.అయితే ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరమై చాలా సంవత్సరాలు అవుతోంది.అలాగే ప్రస్తుతం ఈమె తన సోదరుడితో కలిసి హోటల్ బిజినెస్ చేస్తోంది. కానీ అదితి అగర్వాల్ 30 ఏళ్లు పైబడిన కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. ( Aditi Agarwal)

Also Read: Nagarjuna: ఇల్లు వదిలి వెళ్లిపోయిన నాగచైతన్య.. కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున.?

దానికి ప్రధాన కారణం ఇండస్ట్రీలో జరిగిన ఆ సంఘటనే అని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే..ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ హీరో తరుణ్ ని గాఢంగా ప్రేమించిన సంగతి మనకు తెలిసిందే.ఈ హీరో కోసం చాలా సార్లు సూసైడ్ కూడా చేసుకోవాలి అనుకుంది.కానీ వీరి పెళ్లికి తరుణ్ తల్లి ఒప్పుకోకపోవడంతో అది జరగలేదు.చివరికి ఆర్తి అగర్వాల్ కి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు. కానీ పెళ్లయ్యాక సంవత్సరం కూడా భర్తతో కలిసి ఉండలేక తిరిగి ఇండియాకి వచ్చేసి సినిమాల్లో ట్రై చేసింది.

Reason why the Gangotri movie heroine Aditi Agarwal is still unmarried

ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం లైపోజిషన్ చేయించుకుంది.ఆపరేషన్ ఫెయిల్ అవ్వడంతో మరణించింది. అయితే తన అక్క జీవితాన్ని దగ్గర నుండి చూసిన అదితి అగర్వాల్ జీవితంలో పెళ్లి చేసుకోకూడదని, ప్రేమ పెళ్లిపై తనకి నమ్మకం పోయినట్టు తెలుస్తోంది.మరి అదితి అగర్వాల్ పెళ్లి చేసుకుంటుందా? ఆమె ఆలోచనకి దగ్గర అబ్బాయి దొరుకుతాడా లేక జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటుందా అనేది చూడాలి.( Aditi Agarwal)