Vijay Devarakonda's pic released by Kalki movie makers

Vijay devarakonda: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుని తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. రీసెంట్గా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా “కల్కి 2898ఎడి” జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఇండియన్ బాక్ఫా ఫీస్ షాక్ చేస్తుంది అన్న సంగతి తెలిసింది. విడుదలైన అన్ని చోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా రికార్డులు పరంపర సృష్టిస్తుంది.

సైన్స్, ఫిక్షన్ కు ముడిపెడితూ డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలో నటించారు. ఇట్లు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏడూ రోజుల్లో రూ.725 కోట్లు కలెక్షన్స్ సాధించి 1000కోట్లు దిశగా పరుగులు తీస్తుంది…విడుదలైన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసిన కల్కి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, s s రాజమౌళి, మృనాల్ టాగూర్ మరియు రామ్ గోపాల్ వర్మ నుండి అనేక ప్రత్యేక అతిధి పాత్రలు కూడా ఉన్నాయి. వీటిలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది.

విజయ్ క్యారెక్టర్ కి ఇంటెన్సిటి మరియు ఎమోషన్ ల పర్ఫెక్ట్ సమ్మిళనాన్ని తీసుకోవచ్చాడు. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో. అతని పరిమిత స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ, అతని నటన శక్తివంతంగా ను మరియు గుర్తుండి పోయేలా ఉంది. అర్జునుడిగా విజయ్ అందించిన మేకోవర్ మరియు పవర్ ఫుల్ డైలాగ్ లు “కల్కి 2898 ఏడి” లో అద్భుతమైన ఘట్టాలుగా నిలిచాయి. అతని సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ అర్జునుడి పాత్రలో నటించిన హీరో విజయ్ దేవరకొండ ను పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. చేతిలో గండీవం ఎక్కి పడుతూ బాణాన్ని అశ్వద్దామా పైకి బల ప్రయోగం చేసే పోస్టర్ సీన్ రివిల్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.