Vishwak's new movie with Jati Ratnalu director

Vishwak Sen: టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.జాతి రత్నాలు సినిమాతో దర్శకుడు కేవీ అనుదీప్ కు చాలా పాపులారిటీ వచ్చింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవటంతో పాటు ఈ వెంట్లలో ఆయన హావాభావాలు, స్పీచ్ లతో ఫేమస్ అయ్యారు. జాతి రత్నాలు చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ కామెడీతో తీర్చిదిద్ది స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు అనుదీప్. రెండు చిత్రాల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆ తరువాత శివ కార్తికేయన్ తో తర్కెక్కించిన ప్రిన్స్ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో కేవీ అనుదీప్ సినిమా ఫిక్స్ అయిందనే సమాచారం బయటకి వచ్చింది. విశ్వక్ సేన, కేవీ అనుదీప్ కాంబినేషన్ సెట్ అయిందని తెలుస్తోంది. అనుదీప్ చెప్పిన కథకు విశ్వక్ ఓకే చెప్పేశారట. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. 14 రీల్స్ ఎంటర్ డైన్ మెంట్ పథకంపై అనిల్ సుంకర్ ఈ మూవీని నిర్మించనున్నారని తెలుస్తోంది. అక్టోబర్ లో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను కూడా కామెడీ ఎంటర్టైనర్ గానే అనుదీప్ తెరకెక్కించే అవకాశాలు ఉంటాయి.

Vishwak's new movie with Jati Ratnalu director

ఇటీవల కొన్ని విభిన్నమైన సినిమాలు చేస్తున్న విశ్వక్..పూర్తిస్థాయి కామెడీ మూవీ ని ట్రై చేసేందుకు అనుదీప్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ ఎనర్జీకి అనుదీప్ పంచ్ లు తోడైతే ఎంత జోష్ ఉంటుందో చూడాలి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ను ఈ ఏడాది రెండు హిట్లు వచ్చాయి. ప్రయోగాత్మక చిత్రం గామి అంచనాలకు మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రలో నటించారు విశ్వక్. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ అడ్వెంచర్ డ్రామా మూవీకి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. మార్చ్ 8 న రిలీజైన గామి చిత్రం బాక్స్ ఫీస్ వద్ద రూ.25కోట్లు వరకు వసూళ్లను రాబట్టి హిట్టుగా నిలిచింది.