Alekhya Reddy Emotional comments

Alekhya Reddy: నందమూరి ఫ్యామిలీలో హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారిలో తారకరత్న కూడా ఒకరు. ఈయన ఒకేసారి 9 సినిమాలు అనౌన్స్ చేసి రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఈయన రికార్డును ఏ హీరో కూడా చెరిపివేయలేదు. అయితే అలాంటి తారకరత్న సినిమాల్లో సక్సెస్ అవ్వలేదు. అలాగే లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి కూడా పూర్తిగా దూరం అయిపోయారు. అయితే తల్లిదండ్రులతో దూరం పెరిగినప్పటికీ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు తనతో మాట్లాడుతారని బతికున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Alekhya Reddy Emotional comments

అలాగే సినిమాల్లో సక్సెస్ అవ్వకపోవడంతో రాజకీయాల్లో అయినా రానిద్దాం అనుకొని లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో చురుకుగా పాల్గొన్నారు తారక రత్న . కానీ ఏమైందో ఏమో తెలియదు హఠాత్తుగా కుప్పకూలిపోవడంతో బెంగళూరు హాస్పిటల్ కి తరలించారు. ఇక ఆయన 20 రోజులకు పైగా చావు తో పోరాడి చివరికి కన్నుమూశారు.ఇక తారకరత్న చనిపోయిన సమయంలో అందరూ వారి ఫ్యామిలీని తారకరత్న తల్లిదండ్రులు చేరదీస్తారా లేదా అనే దానినే చర్చించుకున్నారు.కానీ తారకరత్న చనిపోయినా కూడా ఆయన తల్లిదండ్రుల కోపం చల్లారలేదేమో తెలియదు కానీ కొడుకు అంత్యక్రియలకు వచ్చిన సమయంలో కనీసం కొడుకుకి పుట్టిన పిల్లల్ని కోడల్ని దగ్గరికి తీయలేదు.(Alekhya Reddy)

Also Read: Nayanthara: నయనతార కి బాగా పొగరు.. వెంకటేష్ ని కూడా లెక్క చేయలేదు..!

దీంతో చాలామంది తారకరత్న తల్లిదండ్రులను తిట్టుకున్నారు. తారక రత్న చనిపోయినప్పటికీ వీరి ఫ్యామిలీకి అండదండగా వైసిపి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, బాలకృష్ణలు ఉన్నారు. ఇప్పటికి కూడా తారకరత్న ఫ్యామిలీ కోడల్ని మనవడు మనవరాళ్ళని దగ్గరికి తీయడం లేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో చిట్ చాట్ లో పాల్గొన్న అలేఖ్య రెడ్డికి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురయింది.మిమ్మల్ని మీ అత్తింటి వారు ఎప్పటికైనా దగ్గరికి తీస్తారు అనే నమ్మకం ఉందా అని అడిగగా..నమ్మకం మీదనే నేను ఇన్ని రోజులుగా బతుకుతున్నాను.

Alekhya Reddy Emotional comments

తారకరత్న గారు కూడా తన నమ్మకాన్ని ఆశను ఎప్పుడు పక్కన పెట్టలేదు.నేను కూడా అదే నమ్మకం, ఆమీద ముందుకు సాగుతున్నాను. కచ్చితంగా ఏదో ఒక రోజు నా నమ్మకం నిజం అవుతుంది. నా పిల్లలకు ఫ్యామిలీ కావాలి.. అంటూ అలేఖ్య రెడ్డి చాలా ఎమోషనల్ గా ఆన్సర్ ఇచ్చింది.దీంతో చాలామంది నేటిజన్స్ ఎంతో భవిష్యత్తు ఉండే కొడుకే చనిపోయాడు.ఇంకా పంతాలు పట్టింపులు అవసరమా.. పంతాలు తగ్గించుకొని కోడల్ని మనవరాళ్లని దగ్గరకి ఇస్తే బాగుంటుంది కదా అని కామెంట్స్ పెడుతున్నారు.(Alekhya Reddy)