All eyes are on Indian 2

Indian 2: కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు 2. ఈ చిత్రం 1996 బ్లాక్ బస్టర్ భారతీయుడు మూవీకి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషన్ కంటెంట్ భారీ అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఇక ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సర్వేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే భారతీయుడు 2 సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ మూవీకి కొన్ని పరిమితులతో U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ మూవీ మూడు గంటల 10 నిమిషాల రన్ టైం తో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. రెండు గంటల విడివి గల సినిమా చూడడానికే ఒక్కొక్కసారి ప్రేక్షకులు ఇబ్బంది పడుతూ ఉంటారు.

All eyes are on Indian 2

ఇక ఇప్పుడు ఇంత టైం ఉన్న ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ఇక దీనిపై దర్శకుడు శంకర్ బాగా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమా కథ అండ్ కథనాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని ఆయన భావిస్తున్నారు. ఇక ఈ మూవీ జూలై 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ రన్ టైం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.