Jasprit Bumrah: భారత క్రికెట్ సభ్యులు బార్బడోస్ నుంచి తిరిగి రాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ప్రపంచ కప్ ట్రోఫీని ప్రధానమంత్రికి చూపించి మురిసిపోయారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టు సభ్యులతో మాట్లాడిన మోడీ ప్రతి ఒక్క ఆటగాడిని పేరు పేరున ప్రశంసించి వారితో కాసేపు ముచ్చటించారు. భారత క్రికెట్ అభివృద్ధికి తాను ఎప్పుడూ తోడుంటానని మాట ఇచ్చారు మోడీ. Jasprit Bumrah

Jasprit Bumrah makes a big statement on his retirement

కాసేపు మోడీతో అందరితో ముచ్చటించిన అనంతరం భారత క్రికెట్ సభ్యులు ప్రధానమంత్రితో విడివిడిగా ఫోటోలు దిగారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ ఇలా ప్రతి ఒక్క ఆటగాడు కప్పు గెలిచిన ఆనందంతో ప్రధానమంత్రి మోడీతో కలిసి ఫోటోలు దిగారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను మోడీ ప్రత్యేకంగా అభినందించారు. Jasprit Bumrah

Also Read: T20 WORLD CUP 2024: టీమిండియా దగ్గర ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదా? అందరినీ ఫూల్స్‌ చేశారా?

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని కేవలం ఏడాదిన్నర సమయం కావడంతోనే ….పట్టువదలని శ్రమతో భారత క్రికెట్ లోకి తిరిగి అడుగుపెట్టి ….ఇప్పుడు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రిషబ్ ను మోడీ హత్తుకొని మరి అభినందించారు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా కొడుకుతో ప్రధానమంత్రి కాసేపు ఆడుకున్నారు. బుమ్రా, అతని భార్య సంజన, కొడుకు మోదీతో ఫోటోలు దిగారు. Jasprit Bumrah

వారి అబ్బాయిని మోడీ తన చేతులతో ఎత్తుకొని మరి ఫోటోలు దిగారు. ఫోటో సెషన్ పూర్తయిన తర్వాత బీసీసీఐ తరఫున జైశా, రోజర్ బిన్నీ నమో నెంబర్ వన్ పేరుతో ఉన్న భారత క్రికెట్ జెర్సీని ప్రధానమంత్రికి బహుమతిగా అందించారు. అయితే… ఈ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పట్లో రిటైర్మెంట్‌ ప్రకటించబోనని.. మరికొన్ని రోజులు క్రికెట్‌ ఆడతానని వెల్లడించారు జస్ప్రీత్ బుమ్రా. తనలో ఇంకా ఆడే సత్తా ఉందన్నారు జస్ప్రీత్ బుమ్రా. Jasprit Bumrah