Sensational truths revealed about actress Malvi Malhotra

Malvi Malhotra: లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ పై కేసు పెట్టడంతో ఒక్కసారిగా వీరి వ్యవహారం మీడియాలో వైరల్ గా మారింది. ఇక వీరి గురించి ఇప్పటికే ఒక్కొక్కటిగా విషయాలు బయటపడుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది. ఇందులో భాగంగా నటి మాల్వి మల్హోత్రా పేరు కూడా బయటికి వచ్చింది. ఇక లావణ్య రాజ్ తరుణ్ ల మధ్య గొడవ జరగడానికి కారణం మాల్వి మల్హోత్రనే అని, ఆమె రాజ్ కి పరిచయం అయినప్పటి నుండి నన్ను దూరం పెడుతున్నాడు అంటూ లావణ్య చెప్పుకొచ్చింది.

Sensational truths revealed about actress Malvi Malhotra

లావణ్య మాల్వి మల్హోత్రా తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా బయటపెట్టింది. ఇదంతా పక్కన పెడితే లావణ్య రాజ్ తరుణ్ ల వ్యవహారంతో నటి మాల్వి మల్హోత్రా పేరు ఒక్కసారిగా మీడియాలో వైరల్ గా మారింది.మరి ఇంతకీ మాల్వి మల్హోత్రా ఎవరు..ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మాల్వి మల్హోత్రా హిమాచల్ ప్రదేశ్లో జన్మించింది. ఈమె హిందీ లోని ఉడాన్ అనే సీరియల్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా సీరియల్ ద్వారా మెల్లిమెల్లిగా సినిమాల్లోకి కూడా వచ్చింది.(Malvi Malhotra)

Also Read: Sai Pallavi: 10 ఏళ్లుగా లవ్..డ్రీమ్ బాయ్ అతడే.. ఫస్ట్ టైం సీక్రెట్ చెప్పిన సాయి పల్లవి.?

తెలుగు, మలయాళ,హిందీ, తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. సినిమాల్లోకి రాకముందు మాల్వి మల్హోత్రా ముంబైలోని యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేసింది. ఇక ఈమె హిందీలో కొన్ని సీరియల్స్,సినిమాల్లో చేసి మలయాళం లో కూడా ఓ మూవీలో నటించింది. ఇక తెలుగులో ఈమె నటించిన మొదటి సినిమా తిరగబడరా సామి. ఇది ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది.

Sensational truths revealed about actress Malvi Malhotra

అయితే తిరగబడరా సామి షూటింగ్ జరిగినప్పటి నుండే మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందట. అయితే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పినప్పటికీ లావణ్య మాత్రం వీరిద్దరి మధ్య వేరే రిలేషన్ ఉందని చెబుతోంది.ఇక వీరిద్దరి మధ్య నిజంగానే ఎఫై** ఉంది అని లావణ్య చెప్పిన మాటల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ ఒకసారిగా హీరోయిన్ మాల్వి మల్హోత్రా మీడియాలో వైరల్ గా మారింది.(Malvi Malhotra)