How much dowry did Varalakshmi take to her house

Varalakshmi: ఏంటి వరలక్ష్మి పెళ్లిలో డైమండ్ చీర, బంగారు చెప్పులా.. వింటుంటేనే వామ్మో ఎంత ఖర్చు పెట్టి చేసుకున్నారో వీరి పెళ్లి అని అనడం విన్నవారి వంతు అవుతుంది. మరి నిజంగానే డైమండ్ చీర ను వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిలో కట్టుకుందా.. కోలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలో ఎంత నిజం ఉంది.. వరలక్ష్మి శరత్ కుమార్ తన అత్తింటికి ఎంత కట్నం తీసుకువెళ్లింది అనేది ఇప్పుడు చూద్దాం.. వరలక్ష్మి శరత్ కుమార్ నికోలయ్ సచ్ దేవ్ ల పెళ్లి ఈనెల అనగా జూలై 2 థాయిలాండ్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

How much dowry did Varalakshmi take to her house

ఆ తర్వాత వీరి రిసెప్షన్ పార్టీని చెన్నైలో ఉండే తాజ్ హోటల్ లో గ్రాండ్ గా చేసుకున్నారు. ఇక వీరి రిసెప్షన్ పార్టీకి ఎంతోమంది సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు,బిజినెస్ మాన్లు ఇలా ఎంతోమంది హాజరయ్యారు. అయితే తాజాగా కోలీవుడ్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.అదేంటంటే కోటీశ్వరుడైన నికోలయ్ తన భార్యకి డైమండ్ చీరని,బంగారు చెప్పులను బహుమతిగా ఇచ్చినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.(Varalakshmi)

Also Read: Venkatesh: పవన్ తో గొడవ పెట్టుకున్న సురేష్ బాబు.. కోపంతో వెంకటేష్ ఏం చేశారంటే.?

అంతేకాదు పెళ్లికి 200 కోట్లు ఖర్చు చేసి శరత్ కుమార్ తన కూతురిని పెళ్లిని గ్రాండ్గా చేశారు అని టాక్ కూడా వినిపిస్తుంది.అయితే ఈ రూమర్లన్నింటిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు నటుడు శరత్ కుమార్. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కూతురు పెళ్లికి 200 కోట్ల ఖర్చు చేసి పెళ్లి చేశాను అంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. చాలా సింపుల్ గా పెళ్లి చేసేసాం.

 How much dowry did Varalakshmi take to her house

అలాగే డైమండ్ చీర,బంగారు చెప్పులు అంటూ వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చారు. అయితే కోలీవుడ్ మీడియా నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వరలక్ష్మికి శరత్ కుమార్ 300 కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో కొన్న ఆస్తిపాస్తులన్నీ తనకే ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అలా మొత్తంగా వరలక్ష్మి తన అద్దె ఇంటికి 500 కోట్ల కట్నం తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.(Varalakshmi )