Lavanya: Raj Tarun's relation with all those heroines

Lavanya: రాజ్ తరుణ్ లవర్ ని అంటూ చెప్పుకున్న లావణ్య రాజ్ తరుణ్ గురించి ఒక్కొక్కటిగా ఎన్నో సీక్రెట్స్ బయటపెడుతోంది. ఆయన డ్రగ్స్ తీసుకుంటాడని,ఆ హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తాడని ఎన్నో ఆయన గురించి తెలియని సీక్రెట్లు బయటపెడుతుంది. ఒకరకంగా రాజ్ కావాలి అంటూనే మరోవైపు తన సీక్రెట్స్ అన్ని బయట పెడుతూ తన పరువు మొత్తం పోగొడుతుంది. అయితే ఇలా చేయడం వల్ల లావణ్య కి ఏం లాభమో తెలియదు. కానీ రాజ్ తరుణ్ పరువు మాత్రం పోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Lavanya: Raj Tarun’s relation with all those heroines

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్ కి ఎంత మంది హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయో అవన్నీ బయట పెట్టేసింది. లావణ్య మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ కి కేవలం మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ మాత్రమే కాదు ఇంకా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందితో ఎఫైర్ ఉంది. అందులో బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ కూడా ఉంది.నేను అప్పట్లో చెన్నైకి ఓ కోర్స్ నేర్చుకోవడం కోసం వెళ్ళిన సమయంలో నేను లేని సమయం చూసి రాజ్ తరుణ్ అరియానా గ్లోరీ తో ఎఫైర్ పెట్టుకున్నారు.(Lavanya)

Also Read: Lavanya: మాల్వి మల్హోత్రా క్యారెక్టర్ బ్యాడ్.. నిఖిల్ వరుణ్ సందేష్ లకు కూడా ఈ విషయం తెలుసు..?

ఈ విషయం రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర కి తెలిసి ఆయన నాకు కాల్ చేసి అంతా చెప్పాడు. అంతేకాదు మనకి రాజ్ ఇంకా దక్కడు అని చెప్పడంతో వెంటనే భయంతో నేను కోర్స్ కూడా నేర్చుకోకుండానే తిరిగి వచ్చేసాను. అలాగే ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించే సమయంలో హీరోయిన్ శాలిని పాండే తో కూడా ఎఫైర్ పెట్టుకున్నాడు.

Lavanya: Raj Tarun's relation with all those heroines

అంతేకాకుండా లవర్ మూవీలో నటించిన సమయంలో ఆ మూవీ హీరోయిన్ రిద్ధి కుమార్  తో కూడా ఆరు నెలలు రిలేషన్ మెయింటైన్ చేశాడు. దాంతో ఈ విషయం నాకు తెలిసి ఆ హీరోయిన్ కి నా రిలేషన్ చెప్పడంతో రిద్ది కి రాజ్ ని వదిలేసింది.ఇక అప్పటినుండి రాజ్ తరుణ్ కి నాకు మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఒక హీరోయిన్ తో ఒకరోజు గడపడం కోసం రాజ్ తరుణ్ ఒక్కరోజే 70 వేలు ఖర్చు చేస్తాడు. అంటూ రాజ్ తరుణ్ ఎఫైర్ లిస్టు మొత్తం బయట పెట్టేసింది లావణ్య.(Lavanya)