Namrata re-entry into Tollywood with Young Hero Movie.

Namrata: నమ్రత.. బాలీవుడ్ లో ఎంతోమందికి కలల రాకుమారి..అలాంటి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అంజి,వంశీ వంటి సినిమాల్లో నటించింది.ఇక ఎప్పుడైతే వంశీ మూవీలో నటించిందో అప్పటినుండి మహేష్ బాబు తో ప్రేమలో మునిగిపోయింది. అయితే వీరి ప్రేమ విషయాన్ని చాలా రోజులు సీక్రెట్ గా ఉంచి ఇంట్లో వాళ్ళని ముందుగా ఒప్పించారు.అయితే వీరి ప్రేమ బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నారట అప్పట్లో.ఇక ఎట్టకేలకు ఇంట్లో వారికి ఈ విషయం చెప్పగా ముందుగా కృష్ణ నమ్రతని కోడలుగా ఒప్పుకోలేదట.

Namrata re-entry into Tollywood with Young Hero Movie.

కానీ మహేష్ బాబు సోదరి మంజుల ఈ విషయంలో కల్పించుకొని తండ్రికి చెప్పడంతో వీరిద్దరి పెళ్లి జరిగిపోయింది.అలా పెళ్లికి ముందు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించడం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారట. అయితే పెళ్లికి ముందు మహేష్ బాబు లేదా కృష్ణ నమ్రతకు కండిషన్స్ పెట్టారో లేదో తెలియదు కానీ పెళ్లవడంతోనే సినిమాలకు పులిస్టాప్ పెట్టేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తెలుగు సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో ఒక టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి నిజంగానే నమ్రత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందా..( Namrata)

Also Read: Roja: భర్తతో రోజాకి విభేదాలు.. అంతా ఆ స్టార్ హీరో చేసిన పనేనా..?

యంగ్ హీరో మూవీలో నమ్రత కనిపిస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో మీరు మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం వస్తే నటిస్తారా నమ్రత ని అడగగా నో ఛాన్స్ అలాంటిదేమీ లేదు. నేను అస్సలు నటించను అని తెగేసి చెప్పింది. కానీ తాజాగా ఫిల్మ్ నగర్ నుండి చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం నందమూరి మోక్షజ్ఞ సినిమాలో నమ్రత నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మధ్య నందమూరి మోక్షజ్ఞ వస్తున్నా అంటూ అందరిలో క్యూరియాసిటీ పెంచేశారు.

 Namrata re-entry into Tollywood with Young Hero Movie.

అలాగే హనుమాన్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా రాబోతున్నట్టు అనౌన్స్ చేసేసారు. ఇందులో భాగంగా ఈ సినిమా గురించి టాలీవుడ్ మీడియా లో ఓ రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే నమ్రత మోక్షజ్ఞ కి తల్లిగా ఈ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో నమ్రత ది మెయిన్ రోల్ అని తెలుస్తోంది..మరి ఇదే నిజమైతే నందమూరి అభిమానులతో పాటు ఇటు సూపర్ స్టార్ అభిమానులకు కూడా పండగే అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ మీడియాలో వినిపించే ఈ రూమర్ నిజం అవ్వాలి అని చాలామంది మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు.( Namrata)