Smartphone: ప్రతీ ఒక్కరు కూడా ఈరోజుల్లో స్మార్ట్ఫోన్లను ఎక్కువగా కొంటున్నారు. స్మార్ట్ ఫోన్లు వలన మన పనులను ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి రూ. 20000 లోపు ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే బెస్ట్ ఆప్షన్స్ మీకోసం. ఈ స్మార్ట్ ఫోన్లను మనం 20 వేల కంటే తక్కువకే కొనచ్చు. లావా అగ్ని 2 5G ఫోన్ అసలు ధర వచ్చేసి 25,999 కాగా అమెజాన్ లో 35% డిస్కౌంట్తో 1699కే పొందవచ్చు. 7050 ప్రాసెసర్ తో ఈ ఫోన్ ని తీసుకొచ్చారు. 66 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే బ్యాటరీని ఇచ్చారు. 6.78 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి డిస్ ప్లే కూడా ఇచ్చారు.

Best Smartphones under Rs.20,000

అలానే వన్ ప్లస్ నోట్ సి త్రీ లైట్ 5G ఫోన్ కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర 19,999. అమెజాన్ లో 12% డిస్కౌంట్తో 17,699కే పొందవచ్చు. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ని ఇచ్చారు. ఇందులో 108 మెగా పిక్సెల్స్ తో కూడిన రేర్ కెమెరాని ఇచ్చారు. 6.72 ఇంచెస్ తో కూడిన డిస్ ప్లే ఇచ్చారు. అలాగే 20,000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లో రియల్ మీ 1250 ఒకటి.

Also read: WhatsApp: వాట్సాప్‌లో ఏఐ ఫీచర్‌ అక్కర్లేదా…? అయితే ఇలా చేయండి..!

ఈ ఫోన్ను 8gb ర్యామ్ 128gb స్టోరేజ్ తో తీసుకొచ్చారు 108 మెగా పిక్స్ తో కూడా కెమెరా ఇచ్చారు. 45 వాట్స్ సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000mah బ్యాటరీని ఇచ్చారు. ధర వచ్చేసి 20,999. 24% డిస్కౌంట్తో 1630 కి సొంతం చేసుకోవచ్చు. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌32 స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 18,999 25 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 14,300కి మీరు పొందవచ్చు (Smartphone).