Kuldeep Yadav: టీమిండియా జట్టు ఇటీవలే అరుదైన ఘట్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మహేంద్ర సింగ్‌ 2007 సంవత్సరంలో టీ 20 ప్రపంచ కప్ తీసుకురాగా.. అప్పటి నుంచి మళ్లీ ఇప్పుడు టీమిండియా జట్టుకు టీ 20 ప్రపంచ కప్ 2024 వచ్చింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీ 20 ప్రపంచ కప్ 2024 గెలుచుకుంది టీమిండియా జట్టు. దక్షిణాప్రికా జట్టును చిత్తుగా ఓడించిన టీమిండియా.. టీ 20 ప్రపంచ కప్ గెలుచుకుంది. Kuldeep Yadav

Kuldeep Yadav marrige with Jacqueline Fernandez

ఇక ఈ వరల్డ్ కప్ విన్నింగ్ లో ఒకరైన కుల్దీప్ యాదవ్ కు సొంత గడ్డపై ఘనస్వాగతం లభించింది. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి టపాసులు, డోలు చప్పుళ్ళ మధ్య ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కుల్దీప్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు చెప్పారు. తాను త్వరలో వివాహం చేసుకోబోతున్నానంటూ అభిమానులకు తీపిక కబురు చెప్పారు. Kuldeep Yadav

Also Read: Abhishek Sharma: సెంచరీ బాదిన అభిషేక్‌శర్మ.. ఉన్న రికార్డులన్ని బద్దలు!

అయితే గత కొంతకాలంగా ఓ బాలీవుడ్ నటితో కుల్దీప్ యాదవ్ రిలేషన్ కొనసాగిస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ ను కుల్దీప్ యాదవ్ కొట్టి పారేశారు. తాను పెళ్లి చేసుకోబోయేది సినీ రంగానికి చెందిన అమ్మాయిని కాదని క్లారిటీ ఇచ్చేశాడు కుల్దీప్ యాదవ్.. తనని…. తన కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావడం చాలా ముఖ్యమని కుల్దీప్ యాదవ్ వివరించాడు. Kuldeep Yadav

ఈ విషయంపై తొందర్లోనే అందరికీ శుభవార్త చెబుతానని ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మరోవైపు వరల్డ్ కప్ గెలవడంపై హర్షం వ్యక్తం చేశాడు కుల్దీప్ యాదవ్. ఈ క్షణాల కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. కాగా, జాక్విలాయ్ ఫెర్నాండెజ్ తో కొన్ని రోజులు స్నేహం చేశాడు కుల్దీప్‌ యాదవ్‌. Kuldeep Yadav