Such scoundrels should be arrested and beate

Renu Desai: ఈ కాలంలో చాలామంది సోషల్ మీడియా కె పరిమితమవుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు పెట్టి లైక్స్ వచ్చేలాగా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. చాలామంది సోషల్ మీడియా కి అంకితం అయిపోయారు. కానీ మరికొందరికి మాత్రం సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టడం లాంటివి అస్సలు నచ్చవు. నచ్చని వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. కొంతమంది ఫేమస్ అయ్యేందుకు ఏదైనా చేస్తుంటే..మరికొందరు మాత్రం వారి ఆనందం కోసం వీడియోస్ చేసుకుంటున్నారు.

అలా వైరల్ అవుతున్న వీడియోస్ పై కొంతమంది విచక్షణ కోల్పోయి వల్గర్ గా కామెంట్స్ పెడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా..పి హనుమంత్ అనే ఛానల్ లో ఓ తండ్రి కూతురి వీడియో పై జోక్స్ చేస్తూ చెత్త వాగుడు వాగారు. చాలా చెత్తగా కామెంట్స్ పెట్టారు. ఆ వీడియో వైరల్ అవ్వటంతో..మరికొందరు పిచ్చిపిచ్చి కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ చైల్డ్ అబ్యూజ్ వీడియోలపై సెలబ్రిటీలు కూడా మండిపడుతున్నారు.

Such scoundrels should be arrested and beate

ఈ క్రమంలోనే..టాలీవుడ్ హీరో సాయిధర్మతేజ్ కు చైల్డ్ అబ్యూజ్ వీడియో, ఫోటోలపై జాగ్రతగా ఉండాలంటూ పేరెంట్స్ ను వేడుకుంటూ షేర్ చేశారు. దీనిపై తెలంగాన సీఎం, డిప్యూటీ సీఎం కూడా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని రిప్లై ఇచ్చారు. దీనిపై చర్చ ఇంకా కొనసాగుతుంది. మంచు మనోజ్ తో సహా అడివి శేష్, విశ్వక్ సేన్ ఇలా అందరు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రేణు దేశాయ్ కూడా ఈ వ్యవహారంపై ఫైర్ అయ్యింది. ‘ఇతరుల వీడియోలు, కంటెంట్ ని ఉపయోగించి చెత్తగా మాట్లాడుతున్న ఈ భయంకరమైన వ్యక్తులను అరెస్ట్ చేసి లాకప్ లో కొట్టాలి. అలాగే ఇలాంటి చెత్త మాటలకు సపోర్ట్ చేస్తూ వారికి రిప్లై లు ఇచ్చే వ్యక్తులను కూడా అరెస్టు చేయాలి.