Do you remember this Buddodi from Kamal Haasan's Swathimutyam

Tollywood: ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు కమల్. విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న కమల్. ఇప్పుడు భారతీయుడు-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాదాపు 28 ఏళ్ల క్రితం రిలీజ్ అయినా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కమల్. అలాగే ప్రభాస్ కల్కి సినిమాలోనూ కనిపించారు. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు. లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే..తన నటనతో యూనివర్సిల్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఎలాంటి పాత్ర అయినా ఇడ్డే ఒదిగిపోయి అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించగలడు కమల్ హాసన్.

ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు కమల్. ఇక కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో స్వాతిముత్యం సినిమా ఒకటి. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతిముత్యం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ అమాయకుడు పాత్రలో కనిపించాడు. మతిస్థిమితం సరిగ్గా లేని వాడి పాత్రలో కనిపించాడు. అలాగే ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో కమలహాసన్ మనవడిగా నటించిన కుర్రాడిని గుర్తుపట్టారా..? పై ఫోటోలో ఉన్న హీరో ఎవరో తెలుసా..? అతని పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు.

Do you remember this Buddodi from Kamal Haasan's Swathimutyam

ఆ కుర్రాడు మరెవరో కాదు ఐ కెన్ స్టార్ అల్లు అర్జున్..అల్లు అర్జున్ ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. అతని పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంటుంది ఈ సినిమాలో.. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు బన్నీ. ఇక ఇప్పుడు పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ క్రేజ్ గురించి..అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.