Gautam Gambhir: టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్ గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ని నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. గౌతమ్ గంభీర్ కే ఈ బాధ్యతలు దక్కనున్నాయని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. 2024 ఐపీఎల్ ట్రోఫీని కోల్కత్తా నైట్ రైడర్స్ గెలిచిన తర్వాత గౌతమ్ గంభీర్ దాదాపుగా ఫిక్స్ అయినట్లే అని అనుకున్నారు. Gautam Gambhir

Gautam Gambhir appointed India men’s cricket head coach and his salary

ఇప్పుడు అంతా ఊహించినట్లుగానే గంభీర్ కు టీమ్ ఇండియా కోచింగ్ బాధ్యతలను అప్పగించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైశా అధికారికంగా వెల్లడించారు. కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 వరల్డ్ కప్ తో ముగిసిపోయింది. ఐసీసీ ట్రోఫీతో ఘనంగా ద్రావిడ్ టీమిండియా కోచింగ్ బాధ్యతలకు గుడ్ బై చెప్పేసాడు. Gautam Gambhir

Also Read: Kuldeep Yadav: బాలీవుడ్ హీరోయిన్‌తో కుల్దీప్ యాద‌వ్ పెళ్లి?

ఇక కొత్తగా నియమితులైన టీమిండియా ప్రధాన గౌతమ్ గంభీర్ ఏటా రూ. 12 కోట్లకు పైగా వేతనం పొందనున్నారట. అలాగే అతని విదేశీ పర్యటనలలో రోజువారి భత్యం రూ. 21,000 కూడా పొందనున్నారు. గంభీర్ కు బిజినెస్ క్లాస్ ప్రయాణం, ఫైవ్ స్టార్ వసతి, పర్యటనల సమయంలో లాండ్రీ ఖర్చులు బీసీసీఐ భరించనుంది. కాగా గంభీర్ మూడున్నర ఏళ్ల పాటు ప్రధాన కోచ్ గా ఉండనున్నారు. Gautam Gambhir