Lavanya pregnant by Raj Tarun

Raj Tarun: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం చిలికి చిలికి గాని వానలా మారినట్టు రోజుకొక కొత్త ట్విస్ట్ వీరి వ్యవహారంలో బయటపడుతుంది. ఈ నేపథ్యంలోని రాజ్ తరుణ్ పై లావణ్య కేసు పెట్టడం,అందులో ఎలాంటి నిజం లేదు అని రాజ్ తరుణ్ రివర్స్ కేసు పెట్టడం, మాల్వి మల్హోత్రా ఇందులో కల్పించుకొని తనని ఇష్యులోకి లాగడంపై లావణ్య పై మాల్వీ కేసు పెట్టడం ఇలా అన్ని జరుగుతూ ఉన్న నేపథ్యంలో తాజాగా లావణ్య ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది.

Lavanya pregnant by Raj Tarun

రాజ్ తరుణ్ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యానంటూ ఒక షాకింగ్ విషయం బయట పెట్టేసరికి చాలామంది షాక్ అవుతున్నారు. తాజాగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ తో ఉన్న తన ఫోటోలతో పాటు రాజ్ తరుణ్ వల్ల తాను ప్రెగ్నెంట్ అయ్యాను అనే విషయాన్ని కూడా బయటపెట్టింది. తాజాగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. నేను లావణ్య పేరు మార్చుకొని అన్విత రావుగా కొనసాగుతున్నాను.(Raj Tarun)

Also Read: Masthan Sai: రాజ్ తరుణ్ గురించి సంచలన విషయం బయటపెట్టిన లావణ్య లవర్ మస్తాన్ సాయి.?

రాజ్ తరుణ్ నేను అన్విత అనే పేరు మీదే విదేశాలకు కూడా వెళ్ళాం. ఇద్దరం చాలా సంవత్సరాలు తిరిగాం.రాజ్ నన్ను గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడు. మా ఇద్దరి మధ్య చాలా సంవత్సరాలుగా రిలేషన్ ఉంది. కానీ ఎప్పుడైతే మాల్వి మల్హోత్రా ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండే రాజ్ నన్ను పట్టించుకోవడం లేదు. అంతేకాదు రాజ్ తరుణ్ వల్ల నేను గర్భవతిని కూడా అయ్యాను.

Lavanya pregnant by Raj Tarun

కానీ ఈ విషయం బయటికి రాకుండా అబార్షన్ చేయించాడు.దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉంది అంటూ అబార్షన్ చేయించిన మెడికల్ డాక్యుమెంట్ల ను కూడా చూపెట్టింది. దాంతో ఇది నిజమే అవ్వడంతో లావణ్య చెప్పిన దాని ప్రకారం.. రాజ్ తరుణ్ పై ఐపిసి 493 తో పాటు పలు సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే రాజ్ తరుణ్ కి నోటీసులు పంపించి విచారణ చేస్తామని తెలిపారు.(Raj Tarun)