To do that scene with Nani.. the heroine who put such conditions

Nani: హీరో నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. దసరా లాంటి మాస్ మసాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని..ఆ వెంటనే హాయ్ నాన్న అంటూ సాఫ్ట్ స్టోరితో హిట్ కొట్టాడు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ నటుడిగా అంచలంచలుగా ఎదుగుతున్నాడు నాని. సినిమా అంటే మినిమమ్ గ్యారంటి.. ప్రేక్షకులకు కూడా నాని నటన చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

నాని సినిమాలో ఓ సీన్ లో నటించడానికి షాకింగ్ కండిషన్ పెట్టిందట ఓ ముద్దుగుమ్మ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? కృతి శెట్టి. నాని సినిమాల్లోనూ ఈమధ్య లిప్ లాక్ సీన్స్ కనిపిస్తున్నాయి. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కృతి శెట్టి తో నాని లిప్ కిస్ సీన్ ఉంటుంది. అలాగే హాయ్ నాన్న సినిమాలోనూ మృణాల్ తో ఓ లిప్ లాక్ సీన్ ఉంటుంది. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమాలో లిప్ కిస్ సీన్ సమయంలో కృతి శెట్టి ఓ కండిషన్ పెట్టిందట. ముద్దు సీన్ నటించే సమయంలో తన చుట్టూ ఎవరు ఉండకూడదు అని చెప్పిందంట.

To do that scene with Nani.. the heroine who put such conditions

డైరెక్టర్ కెమెరామెన్ తప్ప తన చుట్టూ ఇంకెవరూ ఉండకూడదు అని కండిషన్ పెట్టిందట. చుట్టూ జనం ఉంటే ఆ సీన్ చేయాలను అని చెప్పటంతో దర్శకుడు ఆమె కంఫర్ట్ కోసం అక్కడ ఎవరు లేకుండా చేశారట. ఇక లిప్ లాక్ సీన్స్ పై గతంలో ఓ ఇంటర్వ్యూలో నాని అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ప్రతి సినిమాలోనూ లిప్ లాక్ సీన్ ఉంటున్నాయి మీరే కావాలని రాయిస్తున్నారా.? లేక డైరెక్టర్స్ కథలో అలా రాస్తున్నారా.? అని అడిగిన ప్రశ్నకు నాని దసరా సినిమాలో కిస్ సీన్ లేదు అని చెప్పాడు నాని. ఇక నాని సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. అలాగే హిట్ 3 సినిమాలోను నటిస్తున్నాడు నాని.