Chiranjeevi: Differences between father and son

Chiranjeevi: ఏంటి మెగా ఫ్యామిలీ లోని చిరంజీవి,రామ్ చరణ్ మధ్య గొడవలా.. నిజంగానే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయా.. ఇంతకీ రాంచరణ్ ఏ విషయంలో తండ్రికి ఎదురు చెప్పాడు.. అనే విషయం ఇప్పుడు చూద్దాం. మెగా పవర్ స్టార్ రాంచరణ్,మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంటుంది. వీరిద్దరూ తండ్రి కొడుకుల్లా కాకుండా మంచి స్నేహితుల్లాగే ఇంట్లో కలిసిమెలిసి ఉంటారట.మరీ ముఖ్యంగా సినిమాల విషయంలో ఒకరి సలహాలు మరొకరు పాటిస్తూ ఉంటారట.

Chiranjeevi: Differences between father and son

అయితే చిరంజీవి పెద్ద స్టార్ కాబట్టి ఏ సినిమా విషయంలోనైనా సరే రామ్ చరణ్ దగ్గరికి ఆ ప్రాజెక్టు వస్తే ముందుగా చిరంజీవి ఆ కథను విని ఓకే చేస్తేనే రామ్ చరణ్ ఒప్పుకుంటారట. అయితే అలాంటి ఈ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు ఎక్కడ మొదలైంది అంటే గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి అనే సినిమాల విషయంలో..అసలు విషయం ఏమిటంటే..జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.(Chiranjeevi)

Also Read: Janhvi Kapoor: జాన్వీ కపూర్ వేసుకున్న నెక్లెస్ తో ఓ లగ్జరీ ఇల్లు కొనేయచ్చు..!

అయితే ఈ సినిమాకి సీక్వెల్ తీయాలి అనుకున్నప్పటికీ ప్రస్తుతం శ్రీదేవి బ్రతికి లేదు కాబట్టి ఇది అసంభవం.అయితే ఈ సినిమా సీక్వెల్లో రామ్ చరణ్ నటించాలి అనేది మెగాస్టార్ చిరంజీవి కోరికట. చిరు పాత్రలో రామ్ చరణ్,శ్రీదేవి పాత్రలో జాన్వీ కపూర్ ని పెట్టి ఈ సినిమా తీస్తే బాగుంటుంది అని చిరంజీవి అనుకున్నారట.కానీ రామ్ చరణ్ కి ఇది నచ్చలేదట. రామ్ చరణ్ కి చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకి సీక్వెల్ తీయాలి అననే కోరిక ఉందట.

Chiranjeevi: Differences between father and son

ఇదే విషయాన్ని చిరంజీవికి చెప్పగా నేను వేరే సినిమా అనుకుంటే నువ్వు ఈ సినిమా అనుకుంటున్నావా.. అది కుదరదుగ్యాంగ్ లీడర్ సినిమా నీకు సెట్ అవ్వదు అని అన్నారట. కానీ రామ్ చరణ్ మాత్రం లేదు డాడీ నాకు గ్యాంగ్ లీడర్ సినిమా అంటేనే ఎక్కువ ఇష్టం.ఈ సినిమా సీక్వెల్లో నాకు నటించాలనే కోరిక ఉంది అని తండ్రికే ఎదురు తిరిగారట.ఇక ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య చిన్నపాటి యుద్ధం కూడా నడిచిందని, కానీ అది కేవలం ఫన్నీ గానే అంటూ టాలీవుడ్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.(Chiranjeevi)