Shubman Gill: టీమిండియా బీ టీం కెప్టెన్‌ శుభ్‌ మన్‌ గిల్ స్వార్థం కోసం అభిషేక్ శర్మను తొక్కేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు బలంగా వినిపించడానికి గల కారణం జింబాబ్వేతో జరిగిన మూడవ టీ20ల్లో అభిషేక్ శర్మ ఓపెనర్ గా కాకుండా మూడవ స్థానంలో బ్యాటింగ్ కు రావడమే దీనికి గల ప్రధాన కారణం. జింబాబ్వేతో జరుగుతున్న రెండవ టీ20లో సెంచరీ కొట్టి అభిషేక్ శర్మ ఊపుమీద ఉన్నాడు. ఇ పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటాడు. Shubman Gill

Fans slam Shubman Gill is selfish for demoting Abhishek

స్ట్రైక్ 200కు పైగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అలాంటి బ్యాట్స్మెన్ ను ఓపెనర్ గా పంపలేదు గిల్. వరల్డ్ కప్ జట్టులో ఉన్న గిల్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ లు మూడవ టీ20లోకి అందుబాటులోకి వచ్చారు. దీంతో కెప్టెన్ గిల, జైస్వాల్ లు ఓపెనర్లుగా వచ్చారు. అభిషేక్ శర్మను వన్ డౌన్ కు పంపించారు. వన్ డౌన్ కు వచ్చిన అభిషేక్ శర్మ కేవలం పది పరుగులు మాత్రమే కొట్టి వెనుతిరిగాడు. Shubman Gill

Also Read: Gautam Gambhir: టీమిండియా కోచ్ గా గంభీర్ నియామకం కావడంపై పెద్ద కుట్ర … ఆయన జీతం ఎంతంటే ?

ఇప్పుడు ఈ నిర్ణయాన్ని క్రికెట్ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. పవర్ ప్లేలో యశస్వి జైస్వాల్ కంటే అభిషేక్ శర్మనే విధ్వంసకర ఆటగాడు. అందులోను సెంచరీ చేసి మంచి పాజిటివ్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. అలాంటి వాడిని ఓపెనర్ గా తీసేయకూడదు. అసలే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ల నెమ్మదిగా ఆడే రకం కాదు. Shubman Gill

క్విక్ గా ప్రారంభించి మొత్తం టీం అంతటికీ ఊపును తెప్పిస్తాడు అభిషేక్ శర్మ. కాబట్టి అలాంటి వాడికి ఇంకా ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి తప్ప ఇలా నిరోత్సాహపరచకూడదు అని సూచిస్తున్నారు. వన్డేల్లో ఇప్పుడే అభిషేక్ శర్మ గురించి ఆలోచించకపోయిన పరవాలేదు కానీ టి20ల్లో మాత్రం ఫిక్స్డ్ ఓపెనర్ గా చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఫ్యాన్స్ కూడా అంచనాలు వేస్తున్నారు. Shubman Gill