Heroine: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు. నటనా పరంగా మాత్రమే కాదు గ్లామర్ గా కూడా మంచి గుర్తింపు అందుకుంటున్నారు. ఏదేమైనా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంత ఈజీ కాదు. కొందరు స్టార్స్‌గా సినిమాల్లో ఎదగగా మరి కొందరు అవకాశాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. తన కెరీర్ లో ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఎన్నో విమర్శలన్నింటినీ తట్టుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె ఎవరో తెలుసా?

Heroine Vidya Balan Movie LIfe

ఈ హీరోయిన్ మరెవరో కాదు. విద్యాబాలన్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ లో. ఈ నటి కేరళలో పుట్టి ముంబైలో చదువుకుంది. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉన్న విద్యాబాలన్ హమ్ పాంచ్ అనే సినిమా లో రాధిక పాత్రను పోషించింది. తన కెరీర్ ప్రారంభంలో అనేక అవమానాలను ఎదుర్కొంది విద్యాబాలన్.  తమిళ సినిమాల్లో కూడా నటించింది. మాధవన్ నటించిన తమిళ చిత్రం రన్‌లో ఆమె కథానాయికగా నటించింది. అయితే మొదటి షెడ్యూల్ పూర్తి కాగానే ఆమెను సినిమా నుంచి తప్పించారు. మీరా జాస్మిన్ ఆమె స్థానంలోకి వచ్చింది.

Also Read: Kamal Haasan: కమల్ హాసన్ సినిమా కు చుక్కెదురు.. విడుదల ఆపాలని కోర్టు నోటీసు!!

ఆ తర్వాత దురదృష్టం ఆమెను వెంటాడింది. అక్కడి నుంచి బెంగాల్ వెళ్లింది. అక్కడ ఓ సినిమా చేసి విజయం సాధించింది. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ నుండి ఆఫర్లు వచ్చాయి. ఆమె పరిణీత అనే హిందీ సినిమా చేసింది. సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత విద్యాబాలన్‌కి ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు వచ్చాయి. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూన్న సమయంలో ఆమె బాడీ షేమింగ్‌కి కూడా గురైంది.

లావుగా ఉందని విమర్శించారు. అయినా పట్టు వదలకుండా చిత్ర పరిశ్రమ లో రాణిస్తూనే ఉంది విద్య. సిల్క్ స్మిత బయోపిక్ ది డర్టీ పిక్చర్‌లో నటించింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. విద్య ఈ సినిమా లోని రొమాంటిక్ సీన్స్‌తో  పాపులర్ అయ్యింది. ఈ అమ్మడి నటనతో అందరూ అబ్బురపోయారు. ఆ తర్వాత “భూల్ భూలయ్య”, “బేగం జాన్”, “మిషన్ మంగళ్” తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఏదేమైనా ఈమె కెరీర్ ఒక మైలురాయి అనే చెప్పాలి.