Kamal Haasan Movie Re release Problems

Kamal Haasan: విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో గుణ ఒకటి. ఈ సినిమా 1991లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని స్వాతి ఇంటర్నేషనల్ పతాకంపై పల్లవి మరియు చరణ్ కలిసి నిర్మించారు. సంతాన భారతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన రేఖ కథానాయికగా నటించగా ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Kamal Haasan Movie Re release Problems

ఇటీవల విడుదలైన మంజుమేల్ బాయ్స్ అనే సినిమాలో ఈ సినిమా ప్రస్తావన తీసుకొచ్చి మళ్ళీ ఆ సినిమా తాలుకూ జ్ఞాపకాలు అందరూ గుర్తు తెచ్చుకునేలా చేసింది.  ఈ సినిమాలోని “ప్రియతమా” అనే పాట చాలా పాపులర్ అయింది. మళ్ళీ  ఈ పాటనే “మంజుమ్మెల్ బాయ్స్” సినిమాలో కూడా ఉపయోగించారు. ఇంత బాగుంది ఈ పాట ఏ సినిమాలోనిది అని ఇప్పటి తరం వారు వెతికారు. అప్పుడే నెటిజన్లు గుణ సినిమా కోసం వెతకడం ప్రారంభించారు. ఆ సినిమా నేపథ్యాన్ని కూడా వెతుకుతున్నారు. 

Also Read: Ram Charan: తెలంగాణ లోనే ఈ కారు ఉన్న ఏకైక హీరో రామ్ చరణ్.. ధర ఎంతంటే.?

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఓ ఆసక్తి కరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  జూన్ 21న, పిరమిడ్ మరియు ఎవర్‌గ్రీన్ మీడియా సంస్థలు సంయుక్తంగా తమిళనాడులో ఈ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేశారు. అయితే వారికి కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. గుణ సినిమా రీ-రిలీజ్‌ను నిలిపివేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గన్ శ్యామ్ హేమ్ దేవ్ ఈ సినిమా హక్కులను తానే కొనుగోలు చేసినట్లు ప్రకటించాడు.

దాంతో ఈ సినిమాకు పూర్తి యజమాని తానేనని కోర్టుకు తెలిపారు. సినిమా రీ-రిలీజ్‌ల ద్వారా వచ్చే డబ్బు కూడా తనకే చెందాలని అన్నారు. అంతేకాకుండా, గుణ సినిమా రీ-స్క్రీనింగ్‌పై శాశ్వత నిషేధం విధించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అందుకే గుణ సినిమా రీ-రిలీజ్‌ను తాత్కాలికంగా నిషేధిస్తూ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిరమిడ్ మరియు ఎవర్‌గ్రీన్ మీడియా కూడా గన్ శ్యామ్ హేమ్ దేవ్ పిటిషన్‌పై స్పందించడానికి జూలై 22 వరకు గడువు ఉందని కోర్టు తెలిపింది.