Ram Charan Luxuary car

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోయే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ గ్యాప్ లోనే దేశ కుబేరుడు అయినటువంటి అంబానీ ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. ఇక ఈ వేడుకకు ముంబైకి వెళ్ళబోయే ముందు రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన కూతురు క్లింకారలతో కలిసి ఎయిర్ పోర్ట్ కి ఒక ఖరీదైన కారులో తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు.

Ram Charan Luxuary car

అయితే ఆ కారు ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో కొన్న ఏకైక వ్యక్తి రామ్ చరణ్..అంతే కాదు ఆ కారు ధర కూడా చాలా కాస్ట్లీ.. మరి ఇంతకీ రామ్ చరణ్ కొన్న ఆ ఖరీదైన కారు పేరు ఏంటి..దాన్ని కొనడానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొన్న ఆ కారు ఏంటంటే.. రోల్స్ రాయిస్ స్పెక్టార్ అనే ఖరీదైన కారులో వచ్చారు. (Ram Charan )

Also Read: Balakrishna: బాలయ్య ‘అఖండ -2’ మాములుగా ఉండదట!!

అయితే రామ్ చరణ్ కార్ గ్యారేజ్ లో ఇప్పటికే ఎన్నో ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక తాజాగా ఈ కారు కూడా రాంచరణ్ కార్ గ్యారేజ్ లో చేరిపోయింది. రామ్ చరణ్ దగ్గర ఉన్న రోల్స్ రాయిస్ స్పెక్టార్ కార్ లేటెస్ట్ వెర్షన్ అని తెలుస్తోంది. అలాగే ఈ కారు తెలంగాణలో కొన్న ఏకైక వ్యక్తి రామ్ చరణ్ కావడం విశేషం.

Ram Charan Luxuary car

అంతే కాదు ఈ కారు తయారు చేసినప్పటి నుండి దీన్ని అందుకున్న రెండో వ్యక్తి కూడా రామ్ చరణ్ నేనట.అయితే ఈ కారుని ఎప్పుడో బుక్ చేసినప్పటికీ ఈ మధ్యకాలంలోనే డెలివరీ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఈ కారు ధర తెలిస్తే అంతా నోరేళ్ల పెట్టడం ఖాయం.ఎందుకంటే రామ్ చరణ్ దగ్గర ఉన్న ఆ లగ్జరీ కారు విలువ దాదాపు 7.5 కోట్లని సమాచారం.(Ram Charan )