Ambani Marriage: అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. ఈరోజు రాత్రి 8 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో వీరిద్దరి పెళ్లి జరగగా ఓ వైపు ముంబైలో వర్షం కురుస్తున్నప్పటికీ ఈ పెళ్లికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అంబానీ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముంబై చేరుకుని హంగామా చేస్తుండగా వారిలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం.

Celebrities List For Anant Ambani Marriage

హాలీవుడ్ బ్యూటీలు కిమ్ కర్దాషియాన్, ఖ్లో కర్దాషియాన్, అడెలె, లానా డెల్ రే, డ్రేక్, డేవిడ్ బెక్‌హామ్ మరియు అతని భార్య విక్టోరియా బెక్‌హామ్, జాన్ సెనా, ప్రియన్ కార్డ్స్, నిక్ జోనాస్ దంపతులు ఇప్పటికే ముంబై లో  హల్చల్ చేస్తున్నారు. గత వారం రోజులుగా అంబానీ పెళ్లి వేడుకలతో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఇప్పుడు అంబానీ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా ముంబై చేరుకున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన, కూతురు క్లింకరతో కలిసి గురువారం ముంబై చేరుకున్నారు. నిన్న రామ్ చరణ్ బేగంపేట విమానాశ్రయంలో కొత్త రోల్స్ రాయిస్ కార్ నడుపుతూ కనిపించాడు. ఈరోజు ఉదయం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబు మరియు ఆయన కుటుంబం కూడా ముంబై కి వెళ్తున్న దృశ్యాలు కనిపించిన సంగతి తెలిసిందే. వీరు మాత్రమే కాకుండా చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నాగ చైతన్య, రష్మిక మందన్న, సూపర్ స్టార్ రజనీకాంత్, కన్నడ రాక్ స్టార్ యష్, పలువురు దర్శకులు, నిర్మాతలు హాజరయ్యరట.

Also Read: Sai Pallavi: సాయి పల్లవి తన కెరీర్ ను తానే నాశనం చేసుకుంటుందా?

ఇక భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జాతో కలిసి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకను ఘనంగా నిర్వహించగా మూడు రోజుల పాటు సుమారు 1,200 మంది అతిథులు ఆ వేడుక కు విచ్చేశారు. దీని తర్వాత యూరోపియన్ లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో రెండవ ప్రీ-వెడ్డింగ్ వేడుక జరిగింది, దీనికి దాదాపు 800 మంది అతిథులు రాగా అందులో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు.

https://www.instagram.com/artistrybuzz_/?utm_source=ig_embed&ig_rid=f5c37df2-49d5-4126-8191-e9611d0e535d