Did you know that movie separated Boney Kapoor-Sridevi

Boney Kapoor-Sridevi: ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న బోనీ కపూర్ శ్రీదేవి లను ఆ సినిమా విడదీసిందా.. ఇంతకీ ఆ సినిమా ఏంటి..ఎందుకు ఆ సినిమా కారణంగా ఈ జంట విడిపోయారు.. అనే సంగతి తెలుసుకుందాం. బోనీ కపూర్ శ్రీదేవి విడిపోయారు అంటే నిజంగా విడిపోయారు అని దాని అర్థం కాదు. ఒక సినిమా వల్ల దాదాపు 3 నెలల పాటు వీరిద్దరి మధ్య దూరం పెరిగిందట.

Did you know that movie separated Boney Kapoor-Sridevi

ఇంతకీ ఆ సినిమా ఏంటి.. సినిమా కారణంగా వీరిద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన దివంగత హీరోయిన్ శ్రీదేవి ప్రస్తుతం మన ముందు లేకపోయినప్పటికీ ఆమె సినిమాల రూపంలో అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోతుంది. (Boney Kapoor-Sridevi)

Also Read: Anushka Shetty: నేను పెళ్లి చేసుకునేది అతన్నే.. పెద్ద బాంబు పేల్చిన అనుష్క..?

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ వయసు మీద పడ్డాక కూడా తన ఏజ్ కి తగ్గ పాత్రల్లో నటించింది. అలా నటించిన మూవీనే మామ్.. శ్రీదేవి,సజల్ అలీ కాంబినేషన్లో వచ్చిన మామ్ మూవీ 2017లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో బోనీ కపూర్ తో దాదాపు మూడు నెలలు శ్రీదేవి మాట్లాడలేదట.

Did you know that movie separated Boney Kapoor-Sridevi

ఆ సినిమా షూటింగ్లో పడి తన భర్తతో మూడు నెలలు మాట్లాడలేదని, కేవలం ఉదయం లేవడంతోనే గుడ్ మార్నింగ్, రాత్రి పూట గుడ్ నైట్ చెప్పడం తప్ప ఒక్కరోజు కూడా కలసి మాట్లాడుకున్నది లేదు అంటూ ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీదేవి చెప్పుకొచ్చింది. అలా ఈ సినిమా కారణంగా ఇద్దరి మధ్య మూడు నెలల గ్యాప్ వచ్చింది అంటూ శ్రీదేవి చెప్పింది.(Boney Kapoor-Sridevi)