Rohit Sharma: రోహిత్ చూడడానికి చాలా కూల్ గా కనిపిస్తాడు కానీ ఆటలో విధ్వంసం సృష్టిస్తాడు. కెప్టెన్ గాను అగ్రెసివ్ గానే ఉంటాడు. గంభీర్ చూడడానికి చాలా సీరియస్ గా కనిపిస్తుంటాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. చేయాలనుకున్నది తప్పకుండ చేస్తాడు. స్టార్స్ కన్నా జట్టుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. విజయాలు సాధించాలంటే సమిష్టిగా రాణించాలని చెబుతాడు. అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చేసుకుంటాడు. స్వేచ్ఛను కోరుకుంటాడు. సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడడు. ఇప్పుడు రోహిత్, గంభీర్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. Rohit Sharma

Gambhir came Rohit out of Team India

ఇద్దరి మధ్య వయసు మరీ అంత ఎక్కువగా ఏమీ ఉండదు. రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు. గౌతమ్ గంభీర్ వయసు 42 సంవత్సరాలు. అంటే ఇద్దరూ సమాన వయస్సు గలవారే. కేవలం నాలుగేళ్ల తేడాతో అంతర్జాతీయ కెరియర్ ను ఆరంభించాడు. 2008 నుంచి 2013 వరకు భారత జట్టు తరుపున కలిసి ఆడారు. ఐపీఎల్ 2018 వరకు ఎదురుపడ్డారు. గతంలో కోహ్లీ విషయంలో గంభీర్ ప్రశ్నించాడు. విరాట్ ఆటతీరుపై తన నిర్ణయాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు. విమర్శలు చేశాడు. కానీ రోహిత్ పై పాజిటివ్ గానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. హిట్ మాన్ సెల్ఫ్ క్రికెటర్ అని గతంలో పొగిడాడు. రికార్డుల గురించి పట్టించుకునే టైపు కాదనే విధంగా మాట్లాడాడు. ఐపిఎల్లో తన బ్యాటర్ గా తన కెప్టెన్సీకి సవాలు విసిరే ఆటగాడు రోహిత్ శర్మనే అని అన్నాడు. Rohit Sharma

Also Read: Shubman Gill: గిల్‌ సెల్ఫీష్ కెప్టెన్..ప్రమాదంలో అభిషేక్ శర్మ‌ కెరీర్‌ ?

అలాంటి హిట్ మ్యాన్ తో కలిసి గంభీర్ ఇప్పుడు టీమిండియాను గైడ్ చేయబోతున్నాడు. మొన్నటి వరకు టీమ్ ఇండియాకు హెడ్ కోచ్ గా ద్రావిడ్ ఉన్నాడు. ద్రావిడ్ తో రోహిత్ శర్మకు బాండింగ్ బాగానే పెరిగింది. ఇద్దరి కాంబినేషన్లో భారత జట్టు అద్భుతాలు చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా ఫైనల్ వరకు వెళ్ళింది. వన్డే వరల్డ్ కప్ లోనే భారత జట్టు ఫైనల్ చేరింది. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఏకంగా ఛాంపియన్ గా నిలిచింది. కోచ్ కెప్టెన్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడం చాలా సహజం. Rohit Sharma

ద్రావిడ్, రోహిత్ మాత్రం తమదైన రీతిలో జట్టును నడిపించారు. ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించారు. ఫైనల్ గా విజయాలు సాధించారు. రోహిత్, ద్రావిడ్ ఎక్కువగా గణాంకాలకు ప్రయారిటీ ఇచ్చేవారు. అంటే గత గణాంకాల ప్రకారం వ్యూహాలను సిద్ధం చేసుకునేవారు. టి20 వరల్డ్ కప్ లో పిచ్ లు, స్పిన్నర్లకు అనుకూలిస్తాయని లెక్కల ప్రకారమే నమ్మారు. అందుకోసం వరల్డ్ కప్ కోసం నలుగురు స్పిన్నర్లను తీసుకున్నారు. ఆ ప్లాన్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. అయితే గంభీర్ పెద్దగా డేటాకు ప్రయారిటీ ఇవ్వడు. అందుకే రోహిత్ గంభీర్ జోడి ఎలా ముందుకు సాగుతుందా అని ఆసక్తి రేపుతోంది. గెలుపు జోష్ కొనసాగిస్తూ టోర్నీలు గెలిస్తే చాలని అభిమానులు కోరుకుంటున్నారు. Rohit Sharma