Heroine Deeksha Seth Present Situation 

Deeksha Seth: చాలా మంది హీరోయిన్ లు సినిమా ప్రపంచంలో రాణించాలని కోరుకుంటారు. అలా కొంతమంది హీరోయిన్ లు పదేసి సినిమాలు చేసినా వారికి పెద్దగా ఫేమ్ రాదు. అయితే కొంతమందికి మాత్రం ఒక్క సినిమా చాలు. ఒక్క సినిమాతోనే స్టార్స్ అవుతారు. అలా ఒకట్రెండు సినిమాలు చేసి పెద్ద హీరోయిన్ లు అవుతుంటారు. అలా తన అందం, నటనతో మొదటి సినిమాలోనే ఆకట్టుకున్న హీరోయిన్ దీక్షాసేథ్. “రెబల్” సినిమాలో ప్రభాస్ సరసన నటించిన ఈ హీరోయిన్ “వేదం” చిత్రంలో అల్లు అర్జున్ ప్రియురాలిగా నటించింది.

Heroine Deeksha Seth Present Situation 

ఈ సినిమాలు విడుదలైన తర్వాత దీక్షకు తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి. టాలెంటెడ్ హీరో గోపీచంద్ సరసన “వాంటెడ్” సినిమాలో మెరిసింది. మాస్ మహారాజా రవితేజ నటించిన నిప్పు మరియు మిరపకాయ చిత్రాలలో కూడా కనిపించింది. ఇవే కాకుండా ఆమె మరి కొన్ని సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా ఎదిగింది.

Also Read: Bharateeyudu 2 Review: భారతీయుడు 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

దీక్షా నటించిన తెలుగు సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఈ బ్యూటీకి ఊహించినంత ఆఫర్లు రాలేదు. చివరగా, ఆమె 2012 తెలుగు చిత్రం ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా. తెలుగు, హిందీ భాషలతో పాటు ప్రస్తుతం జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్‌తో కలిసి జాగూబాయి చిత్రంలో కూడా నటించింది.  ఆ తర్వాత తెలుగు ఆఫర్లు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ హమ్ దీవానా దిల్, హౌస్ ఆఫ్ డెత్ 2 మరియు ఇతర హిందీ చిత్రాలలో నటించింది.

అయితే ఇంత చేసినా ఈ సుందరికి అదృష్టం కలిసిరాలేదు. సినిమాలకు గుడ్ బై చెప్పడం తప్పా ఏమీ చేయలేకపోయింది. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో దీక్ష లండన్ వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ ఐటీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీక్షా సేథ్ సోషల్ మీడియాలో కూడా చాలా సైలెంట్ గా ఉంటారు. అయితే ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.