Kamal Haasan not marry to Sridevi Why

Kamal Haasan: సౌత్ ఇండస్ట్రీలో విశ్వ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కమల్ హాసన్ మాత్రమే. అయితే అలాంటి కమల్ హాసన్ ఇప్పటికే ఇద్దర్ని పెళ్లి చేసుకొని ఆ ఇద్దరికి విడాకులు ఇచ్చేసి గౌతమి అనే హీరోయిన్ తో పెళ్లి కాకుండానే సహజీవనం చేశారు.కానీ ఆమె కూడా ప్రస్తుతం కమల్ హాసన్ కి దూరంగానే ఉంటుంది.అయితే అలాంటి కమల్ హాసన్ మొదట వాణి గణపతిని పెళ్లాడి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత నటి సారికతో ప్రేమలో పడి సహజీవ చేసి పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలు పుట్టాక ఆమెకి కూడా విడాకులు ఇచ్చేసాడు.

Kamal Haasan not marry to Sridevi Why

అలా కమల్ హాసన్ జీవితంలో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. మరీ ముఖ్యంగా కమల్ హాసన్ కి శ్రీవిద్యతో ఉన్న ప్రేమాయణం కోలీవుడ్లో ఇప్పటికీ ఓ సెన్సేషనే.ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఇక ఈ హీరోయిన్ చనిపోయే సమయంలో కమల్ హాసన్ ని చూడాలని కమల్ హాసన్ తో కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుందట. ఇక ఆమె కోరిక మేరకు కమల్ హాసన్ శ్రీ విద్య దగ్గరికి వచ్చారట.(Kamal Haasan )

Also Read: Bharateeyudu: శంకర్ భారతీయుడు సినిమా తీయడం వెనక ఉన్న సీక్రెట్ ఇదేనా.?

ఇక కమల్ హాసన్ జీవితంలో శ్రీవిద్య,వాణి గణపతి,సారిక, గౌతమి వంటి వాళ్లే కాదు సిమ్రాన్, శ్రీదేవి వంటి హీరోయిన్లతో కూడా ఈయన కి ఎఫైర వార్తలు వినిపించాయి. మరీ ముఖ్యంగా శ్రీదేవి కమల్ హాసన్ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.అయితే వీరి కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు వచ్చేసరికి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనే టాక్ కూడా కోలీవుడ్ మీడియాలో వినిపించింది.అంతేకాకుండా కమల్ హాసన్ శ్రీదేవి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా కమల్ ప్రతిసారి శ్రీదేవి ఇంటికి వెళ్లేవారట. అలా వెళ్ళిన టైంలో శ్రీదేవి తల్లి ఓ రోజు నేరుగా మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని అడిగిందట.

Kamal Haasan not marry to Sridevi Why

కానీ ఆమె ప్రపోజల్ ని ఆయన రిజెక్ట్ చేశారు.నేను శ్రీదేవిని పెళ్లి చేసుకోలేను అని చెప్పారట.అయితే దీనికి కారణం ఏంటంటే.. శ్రీదేవిని ఆయన ఒక తోబుట్టువు లాగా భావించారట. అంతేకానీ శ్రీదేవి పై తనకు వేరే ఎలాంటి చెడు ఉద్దేశం లేదు అని ఆమె తల్లికి కరాకండిగా చెప్పేసారట.ఇక ఈ విషయాన్ని కమల్ హాసన్ శ్రీదేవి మరణించిన సమయంలో ఆమెకు నివాళులు అర్పిస్తూ కమలహాసన్ చెప్పారు.అంతేకాదు శ్రీదేవి తనను ఎప్పుడు కలిసినా కూడా సార్.. సార్.. అని గౌరవంగా పిలిచేది అంటూ గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.(Kamal Haasan )