Simran Sister Monal Suicide Mystery

Simran: సౌత్ సినిమా ఇండస్ట్రీలో మెరిసిపోయిన అలనాటి స్టార్ హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి అగ్రనటిగా గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. పెళ్లి చేసుకుని సినిమాలకు వీడ్కోలు పలికింది. అయితే ఆ తర్వాత కూడా సిమ్రాన్ కొన్ని సినిమాల్లో నటించింది. కొన్నాళ్లుగా సినిమాల్లో నటించగా ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన కుటుంబ విషయాలను పంచుకుంటున్నారు సిమ్రాన్.

Simran Sister Monal Suicide Mystery

అయితే సిమ్రాన్ సోదరి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె సోదరి పేరు మోనల్. తన సోదరిలాగే ఆమె ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సిమ్రాన్ సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తుండగా, ఆమె సోదరి కూడా సినిమాల్లోకి రావాలని కోరుకుంది. ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మోనాల్. ఇంద్రధనుష్ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది.ఆ తర్వాత టాలీవుడ్‌లో చాలా సినిమాలకు సైన్ చేసింది. మోనాల్ తక్కువ కాలంలో స్టార్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే కెరీర్ బాగానే ఉన్న సమయంలో మోనార్ ఆత్మహత్య చేసుకుంది.

Also Read: Bharateeyudu 2 Review: భారతీయుడు 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

ఏప్రిల్ 14, 2002న, మోనాల్ చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది మోనాల్. ఆ సమయంలో, ఆమె చేతినిండా చిత్రాలు ఉన్నాయి. అప్పటికీ, ఆమె వయస్సు కేవలం 21 సంవత్సరాలు. మోనాల్ ఆత్మహత్య ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. మోనాల్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న సిమ్రాన్ కుటుంబం మరియు సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. అయితే తన సోదరి ఆత్మహత్యకు ఓ బాలీవుడ్ స్టార్ హీరో కారణమని భావించి సిమ్రాన్ ఆ సమయంలో బాధను వ్యక్తం చేసింది.

ప్రేమ పేరుతో సోదరిని మోసం చేశాడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై స్పష్టమైన ప్రకటన లేదు. సిమ్రాన్ సోదరి మోనాల్ ఆత్మహత్య మిస్టరీగా మిగిలిపోయింది. సినిమా రంగంలోకి రావాలని, నటిగా ఎదగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ అమ్మాయి తన 21వ ఏట ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో అందరినీ కలిచివేసింది.