That star hero is supporting Raj Tarun

Raj Tarun: రాజ్ తరుణ్,లావణ్యల వ్యవహారం గురించి ఇప్పటికే మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా లావణ్య పలు యూట్యూబ్ ఛానల్స్ కి, మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ రాజ్ తరుణ్ గురించి ఎన్నో సంచలన విషయాలు బయట పెడుతుంది. ఈ నేపథ్యంలోనే లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా రాజ్ తరుణ్ చేసిన ఎన్నో తప్పులను బయటపెట్టారు. అయితే రాజ్ తరుణ్ లావణ్య మాట్లాడుకున్నా కొన్ని ఫోన్ కాల్ రికార్డింగ్స్ యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నాయి.ఇందులో లావణ్య బూతులతో రెచ్చిపోయింది.

That star hero is supporting Raj Tarun

అయితే ఈ బూతులు మాట్లాడడానికి కూడా కారణం ఉంది అంటూ లావణ్య తరపు న్యాయవాది చెప్పారు. బీర్ బాటిల్ తో కొట్టించుకొని కడుపు తీయించుకొని,వేరే అమ్మాయి దగ్గరికి వెళ్లిన వ్యక్తిని బూతులు తిట్టకుండా నీతులు మాట్లాడుతుందా..ఆ అమ్మాయికి అంత కోపం వచ్చింది కాబట్టే అలాంటి బూతులు మాట్లాడుతుంది అని క్లారిటీ ఇచ్చారు. అయితే గత రెండు మూడు రోజుల నుండి యూట్యూబ్ లో రాజ్ తరుణ్ లావణ్యలకు సంబంధించిన ఒక ఆడియో కాల్ రికార్డింగ్ చక్కర్లు కొడుతోంది.అదేంటంటే నాగార్జునని లావణ్య తిట్టడం.. (Raj Tarun)

Also Read: Bharatheeyudu-2: భారతీయుడు- 2 లో అదే హైలెట్.. కానీ ఆ విషయంలో మళ్లీ దెబ్బేసిన శంకర్..?

మస్తాన్ సాయి అనే అబ్బాయితో లావణ్య ఫోన్లో మాట్లాడుతూ.. నన్ను అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి తీసుకువెళ్లావా సాయి.. వాడెవడో బిగ్ బాస్ అంట నాగార్జున అంట అంటూ తిట్టింది. అయితే దీనికి సంబంధించిన రికార్డింగ్ ఇప్పుడు యూట్యూబ్లో చక్కర్లు కొట్టడంతో దీనిపై రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది లావణ్య. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో యాంకర్ మీరెందుకు మస్తాన్ సాయి తో కాల్ మాట్లాడేటప్పుడు అన్నపూర్ణ స్టూడియో నాగార్జున గాడు అంటూ బూతులు మాట్లాడారు అని అడగగా.. నాకు ఆ టైంలో అలా వచ్చేసాయి..ఎందుకంటే రాజ్ తరుణ్ నువ్వు ఏమైనా చేసుకో..

That star hero is supporting Raj Tarun

ఎక్కడికైనా వెళ్ళు.. అంటూ కేర్ లెస్ గా మాట్లాడుతున్నాడు. నా వెనుక వేరే వాళ్ళు ఉన్నాడు నువ్వు ఏమైనా చేసుకో అంటూ ధైర్యంగా మాట్లాడడంతో నాకు కోపం వచ్చే నీకు ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారు అనుకుంటున్నావో వారి దగ్గరికే వెళ్లి తేల్చుకుంటాను అనే విధంగా నేను నాగార్జున దగ్గరికి వెళ్లి తేల్చుకుంటాను అని అలా మాట్లాడాను అంటూ లావణ్య క్లారిటీ ఇచ్చింది. ఇక లావణ్య మాట్లాడిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో రాజ్ తరుణ్ కి నాగార్జున ఏమైనా సపోర్ట్ ఇస్తున్నారా.. అంటూ నెటిజన్స్ అనుమాన పడుతున్నారు. ఎందుకంటే రాజ్ తరుణ్ నాగార్జునతో నా సామిరంగ మూవీలో చేసిన సంగతి మనకు తెలిసిందే.(Raj Tarun)