TV Anchor into Bigboss 8 season telugu

BIG BOSS8:  దేశంలోనే అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ కు సోషల్ మీడియాలో క్రేజ్ భారీగానే ఉంది. తెలుగు లో కూడా దీనికి భారీ ఆదరణ ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గురించి కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. వాస్తవానికి సెప్టెంబర్ మొదటి వారంలో షో ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి కాస్త ముందుగా ఆగస్ట్‌లో ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. అంతే కాదు కంటెస్టెంట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యారని, వారితో పాటు ప్రొడక్షన్ టీమ్ మరికొంత మంది సెలబ్రిటీలను కూడా సంప్రదించారని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లో చాలా మంది సీరియల్ నటులు ఉంటారట.

TV Anchor into BIGBOSS8 season telugu 

అలాగే చాలా మంది యాంకర్లు మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా ఉంటారని ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగా చాలా మంది పేర్లు వైరల్ అయ్యాయి. కుమారి ఆంటీ, అమృత ప్రణయ్, బర్రెలక్క, యూట్యూబర్ నిఖిల్ గొంతులు వినిపిస్తున్నాయి. తాజాగా మరో సెలబ్రిటీ పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  టెలివిజన్ హోస్టింగ్‌తో ఫేమస్ అయిన వర్షిణి ఈసారి “బిగ్ బాస్” 8వ సీజన్‌లో కూడా కనిపించనుంది. టెలివిజన్‌లో యాంకర్‌గా మాత్రమే కాకుండా, అనేక సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు కూడా పోషిస్తోంది.

Also Read: Bharateeyudu 2 Review: భారతీయుడు 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

అయితే యాంకర్ వర్షిని సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా ఈ బ్యూటీ ఎలాంటి పోస్ట్‌లు పెట్టినా కుర్రకారు ఉడికిపోతుంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో యాంకర్ వర్షిణి పేరు నెట్టింట మారుమోగగా గతంలో  తన పోస్ట్ లతో అందరిని అలరించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే..ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఓ క్రికెటర్ కూడా అడుగుపెట్టనున్నాడు. ఈమేరకు నిర్వాహకుడు ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. అతనే ఇటీవల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు వస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. అంబటి రాయుడు మొదట వైసీపీలో చేరి.. ఆ తర్వాత జనసేనలో చేరారు.

TV Anchor into Bigboss 8 season telugu