Vanitha Vijay Kumar About Ramya Krishna Fight

Vanitha Vijay Kumar: వెటరన్ యాక్టర్ విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా కంటే తన చేష్టలతోనే ఆమె ఎక్కువ వివాదాస్పదమైంది. ఇప్పటికే వనితా విజయ్ కుమార్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ముగ్గురిని పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్య పరిచింది. అంతే కాదు ఆమె తరచూ వార్తల్లో కనిపిస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. ఆమెను తట్టుకోలేక ఆమెను ఆమె కుటుంబం కూడా బహిష్కరించింది. కుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తండ్రిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Vanitha Vijay Kumar About Ramya Krishna Fight

తనకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా తనకు అన్యాయం చేస్తున్నాడని వనితా విజయ్ కుమార్ ఆరోపించారు. దీంతో ఆ కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆమధ్య బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. కాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పై వనితా విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వనితా విజయ్ కుమార్ ‘చంద్రలేఖ’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దేవి సినిమా ద్వారా  తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయం సాధించడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుందని ఊహించలేదు.

Also Read: Boney Kapoor-Sridevi: పాపం.. ఆ సినిమా బోనీ కపూర్-శ్రీదేవి లను విడదీసిందని మీకు తెలుసా..?

ఆ తర్వాత సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇచ్చినా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అయితే, ఆమె స్టార్ హీరోయిన్ రమ్య కృష్ణ జడ్జిగా ఉన్న డ్యాన్స్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణతో జరిగిన ఫైట్ గురించి వనితా విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ డ్యాన్స్ షోలో వనిత కాళిక మాత వేషధారణ లో ఓ పాట కు డాన్స్ వేసింది. కానీ మేకప్ బాగానే ఉంది కానీ డ్యాన్స్ అంత బాగా లేదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. దీంతో వనిత ఆగ్రహం వ్యక్తం చేసింది.

తీర్పు చెప్పకుండా కేవలం వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడం తనకు నచ్చలేదు అని ఆమె చెప్పింది. తనను ఇతరులతో ఎందుకు పోలుస్తున్నారు..?  అని వనిత ఆగ్రహించి అక్కడి నుండి వెళ్లిపోయింది. తాజాగా రమ్యకృష్ణ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, ఆమె మంచి నటి అని కొనియాడింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.