Bharateeyudu2 movie first day collections 

Bharateeyudu2: దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 చిత్రం షూటింగ్ దాదాపు ఆరేళ్ల క్రితం మొదలై అనేక అడ్డన్కులతో ఆగిపోయి ఎట్టకేలకు నిన్న విడుదలైంది. ఏదేమైనా విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్లు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషించగా దర్శకుడు శంకర్ ఈ సినిమా ను ఏవిధంగానూ కంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించాడు. ‘భారతీయుడు 2’ మాత్రమే కాకుండా మూడో భాగం కూడా ఉంటుందని మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రకటించారు. ఇది కమల్ఈ అభిమానులను ఎంతో ఆసక్తి పరిచే విషయం.

Bharateeyudu2 movie first day collections 

ఈ చిత్రం మొదటి రోజు మిశ్రమ సమీక్షలను అందుకుంది, అయితే ఆ తర్వాత సానుకూల సమీక్షలను అందుకుంది. కానీ ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం “ఇండియా 2” సినిమాలో శంకర్ మార్క్ మిస్ అయింది. ఎప్పటిలాగే, కమల్ హాసన్ నటన కన్నుల పండుగగా ఉంది విమర్శకులు కూడా రకుల్ మరియు సిద్ధార్థ్ నటనను ప్రశంసించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులపై ఊహించిన ముద్ర వేయలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ గురించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: Ananth Ambani: అనంత్ అంబానీ కుర్తా పై ఉన్న ఆ చిన్న వజ్రం ధర అన్ని కోట్లా..?

“భారతీయుడు 2” మొదటి రోజు నెట్ బాక్సాఫీస్ 26.1 కోట్ల రూపాయలు. తమిళనాట రూపాయలు. 16 కోట్లు రాబట్టగా తెలుగులో రూ. 8 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. అయితే హిందీ వసూళ్లు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో కేవలం ఒక కోటి రూపాయల రాబట్టినట్లు తెలుస్తోంది. విక్రమ్, కల్కి లాంటి బ్యాక్ టు బ్యాక్ పెర్ఫార్మెన్స్ తో అద్భుతమైన ఫామ్ లో ఉన్న కమల్ హాసన్ కి “భారతీయుడు 2” నిరాశనే మిగిల్చిందనే చెప్పాలి. విక్రమ్ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు దాటగా, భారతీయుడు బాక్సాఫీస్ వద్ద తక్కువ కలెక్షన్లను చేరుకోవడం నిరాశే అని చెప్పాలి.