Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఎన్నికైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ హెడ్ కోచ్ గా గంభీర్ శకం మొదలు కాబోతోంది. ఇప్పటివరకు సక్సెస్ఫుల్ మెంటార్ గా సత్తా చాటిన గంభీర్ కోచ్ గా తనదైన ముద్ర వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. తనకు కావలసిన సహాయక సిబ్బంది విషయంలో క్లారిటీగా ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ల ఎంపిక విషయంలో కసరత్తులు చేస్తున్నాడు. కొందరి పేర్లతో జాబితాలు ఇప్పటికే బీసీసీఐ ముందు పెట్టాడు. అయితే గంభీర్ ఇచ్చిన లిస్ట్ లో కొందరిని బీసీసీఐ పక్కన పెట్టేసింది. మరికొందరి పేర్లను పరిశీలిస్తుంది. Gautam Gambhir

Gautam Gambhir new demands Danger player coming for Team India

టీమిండియా హెడ్ కోచ్ గా పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకోకముందే బీసీసీఐకు తనకు కావాల్సిన సపోర్ట్ టీం విషయంలో గంభీర్ ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో తనకు స్వేచ్ఛను ఇవ్వాలని కోరాడు. దానికి బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే విదేశీ ఆటగాళ్ల పేర్లను గంభీర్ సిఫారసు చేస్తున్నాడు. బీసీసీఐ సానుకూలంగా స్పందించడం లేదు. ఫీల్డింగ్ కోచ్ గా విదేశీ ఆటగాడి పేరును గౌతమ్ గంభీర్ బీసీసీఐ ముందు ఉంచాడు. ఈ విజ్ఞప్తిని క్రికెట్ బోర్డు తిరస్కరించింది. మరోసారి విదేశీ ప్లేయర్ ని బౌలింగ్ కోచ్ గా సిఫార్సు చేశారు. Gautam Gambhir

Also Read: Rohit Sharma: గంభీర్‌ వచ్చేశాడు.. టీమిండియా నుంచి రోహిత్‌ ఔట్‌ ?

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్ గా తీసుకోవాలని చూస్తున్నారు. లక్నో సూపర్ జేయింట్స్ లో మెంటార్ గా ఉన్న సమయంలో మోర్నే మోర్కెల్ తో కలిసి గంభీర్ పనిచేశాడు. అతని మెలకువలు తనకు తెలుసు. అవి టీమిండియాకు అవసరం పడతాయని భావించాడు. అందుకే మోర్నే మోర్కెల్ పేరును గంభీర్ ప్రతిపాదించాడు. మోర్నే మోర్కెల్ గత వన్డే వరల్డ్ కప్ వరకు పాకిస్తాన్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అతను 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. మోర్నే మోర్కెల్ తో పాటు బౌలింగ్ కోచ్ రేసులో భారత్ కు చెందిన మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. Gautam Gambhir

వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీలను బౌలింగ్ కోచ్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. జహీర్ ఖాన్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. అయితే బీసీసీఐ మాత్రం జహీర్ పట్ల సానుకూలంగా ఉందని తెలుస్తోంది. మరి చివరకు భారత క్రికెట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకోనుందో చూడాలి. మరోవైపు టీం ఇండియా బ్యాటింగ్ కోచ్ గా కోల్కత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ కోచ్ గా అక్షయ్ నయర్ ఎంపిక దాదాపు ఖాయమైంది. ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్ నే కొనసాగించాలని చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సహాయక సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. టీమిండియా ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళుతుంది. అప్పటినుంచి హెడ్ కోచ్ గా గంభీర్ యాక్షన్ మొదలవుతుంది. Gautam Gambhir