If that sentiment follows then Bunny movie will be a blockbuster

Bunny: మామూలు జనాల నుండి మొదలు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఎలా ఎవరికైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో సెంటిమెంట్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. అయితే చాలామందికి చాలా రకాల సెంటిమెంట్లు ఉంటాయి. సినిమా మొదలు పెట్టేటప్పుడు ఓ సెంటిమెంట్, సినిమా పూర్తయ్యాక ఓ సెంటిమెంట్,రిలీజ్ చేసేటప్పుడు మరో సెంటిమెంట్ ఇలా ఎన్నో ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ సెంటిమెంట్లు బాగానే ఉంటాయి. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరో అల్లు అర్జున్ కి కూడా ఓ రెండు సెంటిమెంట్లు ఉన్నాయట.

If that sentiment follows then Bunny movie will be a blockbuster

ఆ రెండు సెంటిమెంట్లు వర్కౌట్ అయితే కచ్చితంగా అల్లు అర్జున్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టే అంటూ అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ అల్లు అర్జున్ కి ఉన్న ఆ సెంటిమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బన్నీ ఓ రెండు సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతారట. అదేంటంటే..తాను చేసే ఏ సినిమా అయినా సరే వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటే కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందట.అలా ఈ లిస్టులో ఆర్య, దేశముదురు, గంగోత్రి, బన్నీ, జులాయి వంటి సినిమాలు ఉన్నాయి. ఇక మరొక సెంటిమెంట్ ఏంటంటే.. (Bunny)

Also Read: Pawan Kalyan: బెస్ట్ ఫ్రెండ్ ని రక్తం వచ్చేలా కొట్టిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..?

తాను నటించిన సినిమాను ఏప్రిల్ లో విడుదలయితే బ్లాక్ బస్టర్ హిట్ కొడతాయి అనే సెంటిమెంట్ కూడా అల్లు అర్జున్ ఫాలో అవుతాడు అని తెలుస్తుంది.ఎందుకంటే ఈ ఏప్రిల్ మాసంలో విడుదలైన బన్నీ, రేసుగుర్రం వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయట.దాంతో అల్లు అర్జున్ కి ఈ రెండు సెంటిమెంట్లు ఉన్నాయని, వీటినే బన్నీ ఎక్కువగా ఫాలో అవుతారు అని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే అల్లు అర్జున్ కి ఈ సెంటిమెంట్లు ఉన్నాయో లేవో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్స్ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.

If that sentiment follows then Bunny movie will be a blockbuster

అయితే ఈ మ్యాటర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో మరి పుష్ప-2 సంగతి ఏంటి..ఈ సెంటిమెంట్ పుష్ప2 విషయంలో బన్నీ ఫాలో అవుతారా..అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఏప్రిల్ నెలనే సెంటిమెంట్ అని బన్నీ అనుకుంటే మిగిలిన ఈయన హిట్ సినిమాలన్నీ కేవలం ఏప్రిల్ లో విడుదలైనవి మాత్రం కాదు కదా..అలాగే ఈయనకు పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చిన పుష్ప పార్ట్ 1 సినిమా కూడా ఏప్రిల్ లో కాదు డిసెంబర్లో విడుదలైంది. మరి దీని సంగతి ఏంటి అంటూ మిగతా నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Bunny)