Kollywood hero simbu childhood photo 

Kollywood: ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి ఇప్పుడు సౌత్‌లోనే పెద్ద స్టార్ హీరో. రొమాన్స్, యాక్షన్, కామెడీ… ఇలా ఏ తరహా సినిమాకైనా చక్కగా సరిపోతాడు. హీరోగా సినిమా రంగంలోకి రాకముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో కనిపించాడు. కెరీర్ ప్రారంభంలో ప్రధానంగా ప్రేమకథా చిత్రాలను చేసి  లవర్ బాయ్ గా ఉన్నాడు. ఆ తర్వాత యాక్షన్ హీరోగా మారాడు. హీరో మాత్రమే కాదు మంచి గాయకుడు కూడా. పలు స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను అలరించాడు కూడా. సాధారణంగా చాలా మంది హీరోలకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది.

Kollywood hero simbu childhood photo 

కానీ స్టార్ హీరోయిన్స్ అందరూ ఈ హీరోతో ప్రేమలో పడాలని కోరుకునే వారే. ఆయనతో సినిమా చేస్తే సరిపోతుంది అని అనుకునే వారే. ఏ హీరోయిన్‌తో సినిమా చేసినా వారు ప్రేమలో ఉన్నారని వెంటనే పుకార్లు వచ్చేవి. చాలా మంది స్టార్ హీరోయిన్స్‌తో వ్యవహారాలు నడిపి అసలు “వల్లభుడు”గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికైనా ఈ ఫోటో లో ఉన్న అబ్బాయి ఎవరో గుర్తు పట్టారా..ఇంకెవరో కాదండీ కోలీవుడ్ స్టార్ హీరో శింబు. ఇది అతని చిన్ననాటి చిత్రం.

Also Read: Raj Tharun: ఆత్మహత్యా యత్నం చేసిన రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య.. అర్థ రాత్రి హై టెన్షన్!!

ప్రముఖ దర్శకుడు రాజేందర్ వారసుడిగా శింబు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో కనిపించాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  “మన్మథ”, “వల్లభ” సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఈ హీరో. ఈ క్రమంలోనే వరుస ఫ్లాప్‌లు చవిచూసినా కొన్ని సినిమాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. సినిమా సమస్యలను పక్కన పెడితే, శింబు తన కెరీర్ ప్రారంభంలో నయన తారతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఆ తర్వాత త్రిష, హన్సిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్ లతో  శింబు డేటింగ్ చేశాడని వార్తలు వచ్చాయి.

చెప్పాలంటే శింబు డేటింగ్ చేసిన హీరోయిన్ల లిస్ట్ ఇంకా పెద్దదే అని చెప్పాలి. గతంలో హన్సిక, నిధి అగర్వాల్‌లను శింబు పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే అవి ఇంకా రూమర్స్‌గానే ఉన్నాయి. నయనతార కూడా పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. చివరికి ఆమె విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుంది. ఇటీవలే అయన మానాడు, పాతు తలా వంటి సినిమాలతో హిట్ అందుకోగా ఇప్పుడు కమల్ హాసన్ హీరో గా నటిస్తున తగ్ లైఫ్ సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.