Rajinikanth Dance in Anant Ambani Marriage

Ambani Marriage: గత వారం నుంచి ముంబైలో అనంత్ అంబానీ వివాహ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జూలై 12, శుక్రవారం రాత్రి 8 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ లు ఏడడుగులు నడిచారు. దేశవ్యాప్తంగా సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఉత్తరాది, దక్షిణాది సినీ తారలు  ఈ వేడుకలో పాల్గొన్నారు. పది రోజులుగా బాలీవుడ్ తారల రాకతో ఈ ప్రీ వెడ్డింగ్ సంబరాలు అంబరాన్నంటాయి. బాలీవుడ్ సినీ తారలు సంగీత్, హల్దీ, మెహందీ వేడుకల్లో పాల్గొన్నారు. అలా నిన్న జరిగిన వివాహానికి టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

Rajinikanth Dance in Anant Ambani Marriage

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఈ వివాహానికి హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ తో కలిసి వచ్చారు. నయనతార, విఘ్నేష్ శివన్, సూర్య, జ్యోతిక, రానా దగ్గుబాటి మరియు అతని భార్య మిహిక పెళ్లి లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అంబానీ ఫ్యామిలీ పెళ్లి వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పాలి. ఆయన వరుడు అనంత్ అంబానీతో కలిసి చేసిన డ్యాన్స్ అలరించింది.

ఇక బాలీవుడ్ హీరోలు అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్‌లతో కలిసి అనంత్ అంబానీ, రజనీకాంత్ డ్యాన్స్ చేశారు. 73 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్ చిన్న చిన్న స్టెప్పులతో డ్యాన్స్ చేస్తు అభిమానులను అలరించారు. అయన ఎనర్జిటిక్ పేస్ చూసి బాలీవుడ్ స్టార్లు సైతం ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వయసులో కూడా తాను డ్యాన్స్‌లో ఇరగదీయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది..

“తలైవా” రజనీకాంత్, అతని భార్య లత మరియు కుమార్తె సాండ్రియా కూడా అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, సంజయ్ దత్, జెనీలియా దేశ్‌ముఖ్, రితేష్ దేశ్‌ముఖ్, సిద్ధార్థ్, కియారా అద్వానీ, అలియా భట్, రణబీర్ కపూర్ లు ఈ పెళ్లి కి కొత్త కళ తీసుకొచ్చారు.

— Filmfare (@filmfare) July 12, 2024