The hero who roman**d his lover before RGV eyes

RGV: ఏంటి ఆర్జీవి కళ్ళముందే ఆయన లవర్ తో మరో హీరో రొమాన్స్ చేశాడా.. దీన్ని రాంగోపాల్ వర్మ ఎలా భరించాడు.. దాన్ని తట్టుకొని అక్కడ ఎలా ఉండగలిగాడు అనే సంగతి ఇప్పుడు చూద్దాం.ఆర్జీవి ఎఫైర్ లిస్టులో ఎంతోమంది బ్యూటీస్ ఉన్నారు. అంతేకాదు ఎవరైనా యాంకర్ తో నైనా లేదా ఏ నటితోనైనా ఇంటర్వ్యూ లో పాల్గొంటే చాలు వారితో గాసిప్ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పటికే తన కళ్లలో పడ్డ ప్రతి అమ్మాయిని పెట్టి సినిమా తీస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ.

The hero who roman**d his lover before RGV eyes

ఇక ఆర్జీవి ని ఇంటర్వ్యూ చేసిన అరియానా, అషు రెడ్డి వంటి వాళ్ళు ఫేమస్ అయిపోయారు. అంతేకాకుండా ఈయనకు జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు అంటే పిచ్చి ఇష్టమట. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా రాంగోపాల్ వర్మనే ఎన్నో ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే రాంగోపాల్ వర్మ ప్రేమించిన మరొక హీరోయిన్ ఎవరంటే.. సీనియర్ నటి అంతరా మాలి.. ఈమె బాలీవుడ్ హీరొయిన్ అయినప్పటికీ తెలుగులో సుమంత్ హీరోగా చేసిన ప్రేమ కథ అనే మూవీలో నటించింది. (RGV)

Also Read: Chiranjeevi: తండ్రి కొడుకుల మధ్య విభేదాలు.. తండ్రికి ఎదురు తిరిగిన చరణ్..?

అయితే అక్కినేని సుమంత్ కి ఇది మొదటి సినిమా. అలాగే ఈ మొదటి సినిమాకి దర్శకుడిగా రాంగోపాల్ వర్మ చేశారు.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అంతరా మాలితో ప్రేమలో పడిపోయిన రాంగోపాల్ వర్మ సినిమా షూటింగ్లో అంతరామాలితో అక్కినేని సుమంత్ రొమాన్స్ చేస్తే అస్సలు తట్టుకోలేకపోయేవాడట. అంతేకాదు కొన్ని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కించే సమయంలో సుమంత్ అందులో కరెక్ట్ గా చేయకపోవడంతో పది,పదిహేను సార్లు టేక్స్ తీసుకునేవాళ్ళట.

The hero who roman**d his lover before RGV eyes

అలా అన్నిసార్లు తన ముందే తాను ప్రేమించే అమ్మాయితో సుమంత్ అలా రొమాన్స్ చేయడం చూసి ఆర్జీవి తట్టుకోలేకపోయేవాడట.కానీ డైరెక్టర్గా తన విధి తాను నిర్వహించాలి కాబట్టి ఎన్ని టేక్స్ అయినా సరే సన్నివేశం బాగా వచ్చేవరకు మళ్లీ మళ్లీ అదే షాట్ చేయించేవారట. అలా ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆర్జీవి ఎంతగానో ఇబ్బంది పడిపోయారు అంటూ అప్పట్లో ఓ టాక్ వినిపించింది.అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన ఓల్డ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.(RGV)