Bhanu Sri: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు బద్దలు కొట్టాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి చిత్రం జూన్ 27న విడుదల కాగా తాజాగా ఈ సినిమా రూ.1000 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. టాలీవుడ్‌లో వెయ్యి కోట్లు వసూలు చేసిన రెండు సినిమాల్లో ప్రభాస్ హీరో కావడం విశేషం. మొదటగా బాహుబలి సినిమా రిలీజ్ కాగా రెండోది కల్కి. ఇక బాహుబలి కంటే ముందు మిర్చి సినిమా లో ప్రభాస్ నటించాడు. కొరటాల శివ ఆ సినిమా కి దర్శకత్వం వహించాడు.

Bhanu Sri in Prabhas anushka Mirchi movie

ప్రభాస్ కెరీర్‌లోనే ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచిందని చెప్పాలి. మిర్చి సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు పాత్రల్లో నటించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, రిచా గంగోపాద్యయా నటించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.  ‘మిర్చి’ సినిమాలోని ‘డార్లింగే ఓసి నా డార్లింగే’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకుల నోట నానుతూనే ఉంటుంది. 

Also Read: Allu Arjun: ఆ హీరోయిన్ కోసం స్నేహ రెడ్డికి బ్రేకప్.. ?

అయితే ఈ పాటలో కనిపించే ఈ అమ్మాయిని గుర్తు పట్టారా.. అనుష్కతో కనిపించిన ఈ లేడీ ఇప్పుడు పెద్ద నటి. ఆమె ఇటు టెలివిజన్ లో  అటు సినిమాలు రెండింటిలోనూ ప్రముఖ పాత్రలు పోషిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.ఇంతకీ ఆమె ఎవరని మీరు అనుకుంటున్నారా? ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతున్న పటాస్ అనే టీవీ షోకి యాంకర్‌గా చేసి పలు షార్ట్ ఫిలిం లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆమె యాంకర్ కాకముందు చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

కానీ ఈ సినిమాలు భాను శ్రీకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. తర్వాత వ్యాఖ్యాతగా మారి కొన్ని షోలలో కనిపించింది. బుల్లి తెరపై యాంకర్‌గా భాను శ్రీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నటి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటో లు మరియు వీడియోలతో తన అభిమానులను అలరిస్తుంది. ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.