Anant Ambani Marriage: అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం (జూలై 12) న అనంత్ అంబానీ, రాధిక పెళ్లి చేసుకున్నారు. శనివారం (జూలై 13) రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు, అనంత్ అంబానీ రిసెప్షన్‌కు ప్రధాని మోదీతో ప్రారంభించి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పెళ్లికి వచ్చిన అతిథులకు ఖరీదైన బహుమతులు కూడా అందాయని అంటున్నారు.

Celebrities got Crores gifts to Anant Ambani Marriage

అనంత్ అంబానీకి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారన్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణవీర్ సింగ్ మరియు అనేక ఇతర బాలీవుడ్ ప్రముఖులు అనంత్ అంబానీ స్నేహితుల జాబితాలో ఉన్నారు. అందుకే అంబానీ ఇంట్లో ఎప్పుడు వేడుక జరిగినా బాలీవుడ్ హీరోలు ఇక్కడకు వస్తుంటారు. ఇప్పుడు, అనంత్ అంబానీ వారి వివాహానికి ఖరీదైన లగ్జరీ వాచీలను బహుమతిగా ఇచ్చారని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Pani puri: పానీపూరి తింటున్నావా… అయితే జాగ్రత్త.. క్యాన్సర్ రావడం గ్యారెంటీ?

Ademars Piguet Royal Oak Perpetual Calendar Watch బ్రాండ్ అనంత్ నుండి వీరు బహుమతిగా పొందారట. మార్కెట్ లో ఈ ఒక వాచ్ ధర రూ.2 కోట్లకు పైనే పలుకుతోంది. షారుఖ్ ఖాన్ మరియు రణవీర్ సింగ్ ఈ వాచ్ ల తో పోజులిచ్చిన చిత్రాలు మరియు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా సంపన్నుల ఇంట్లో పెళ్లి అంటే మాములు విషయమా.. ఈ స్థాయి లో ఇండియా లో పెళ్ళిళ్ళు ఎవరికీ అవ్వవేమో..