Do you know what Soundarya did when she sensed death in advance

Soundarya: స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్య కి సంబంధించిన ఏ వార్తలైనా సరే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతాయి. అయితే ఈమె మరణించి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ సౌందర్యను సినిమాల్లో చూస్తూ కన్నీళ్లు పెట్టుకునే వీరాభిమానులు ఎంతోమంది ఉంటారు. అయితే సౌందర్య విమాన ప్రమాదంలో మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ ప్రమాదంలో సౌందర్య తో పాటు ఆమె అన్న కూడా మరణించారు. అప్పట్లో సౌందర్య కి సంబంధించిన అన్ని విషయాలు ఆమె అన్న దగ్గరుండి చూసుకునేవారు.

Do you know what Soundarya did when she sensed death in advance

అలా విమాన ప్రమాదంలో ఒకేసారి అన్నా చెల్లెళ్లు ఇద్దరు మరణించారు. అయితే అప్పట్లో సౌందర్య మరణించాక సౌందర్య కి సంబంధించి ఎన్నో రూమర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అందులో ఒకటి ఏంటంటే..సౌందర్య చనిపోతాను అనే విషయం ఆమెకి ముందుగానే తెలుసని, తన చావును ముందుగానే గ్రహించిన సౌందర్య ఆ పని చేసింది అంటూ వార్తలు వినిపించాయి.అయితే ఇంతకీ సౌందర్య ఏం చేసిందయ్యా అంటే..సౌందర్య కొద్ది రోజులు అయితే చనిపోతాను అనగా చాలా డల్ గా ఫేస్ అంతా ఏదో కోల్పోయినట్టు పెట్టేదట. (Soundarya )

Also Read: Nagarjuna: నాగార్జునతో కాపురం చేయాలనుకుంటున్న స్టార్ హీరోయిన్ ఫ్రెండ్..?

సినిమా షూటింగ్లో చాలా డల్ గా ఫేస్ పెట్టేసరికి అందరూ ఏమైంది అని అడిగినా కూడా చాలా నిరాశగా ఏం కాలేదు అని చెప్పేదట.అంతేకాదు తన భర్తతో సౌందర్య ఒకవేళ నేను చనిపోతే నా ఆస్తిని నా ఫ్యామిలీ మీరు ఇద్దరు సమానం తీసుకోవాలి అని చెప్పిందట. అయితే ఆ సమయంలో సౌందర్య భర్త ఆమెపై కోప్పడి ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని తిట్టారట. అయినప్పటికి సౌందర్య అలాగే మాట్లాడేదట.

Do you know what Soundarya did when she sensed death in advance

అయితే చాలామంది అంటుంటారు కదా చనిపోయే విషయం కొంతమందికి ముందుగానే తెలుస్తుంది అని. అయితే సౌందర్య విషయంలో కూడా ఇదే జరిగింది కావచ్చు అని అనుకుంటున్నారు. ఇక సౌందర్య మరణించాక ఆమె ఆస్తిని భర్తే మొత్తం తీసుకున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ విషయంలో సౌందర్య ఫ్యామిలీ కోర్ట్ వరకు వెళ్లిందట. కానీ చివరికి సౌందర్య భర్త కొన్ని ఆస్తిపాస్తులు తన తల్లికి,వదినకు ఇచ్చారట. ఇక సౌందర్య చనిపోయాక కొద్ది రోజులకు సౌందర్య భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.(Soundarya )